చాగంటి కోటేశ్వర రావు గారికి తిరుమలలో అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిటిడి

తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై కేసు నమోదు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేసినందుకు పోలీసు కేసుతో
తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై కేసు నమోదు
టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేసినందుకు పోలీసు కేసుతో పాటు న్యూఢిల్లీలో, విజయవాడ లో గల పిఐబీ (ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో) కి ఫిర్యదు చేసిన టీటీడీ
విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ కి కూడా టీడీడీ ఫిర్యాదు
చాగంటికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను టీటీడీ చేసింది
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా , ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టిటిడి సంస్థను పలుచన చేస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరిక
AdminPost
TTD
tirumala




