కడప జిల్లాలో - దేవాలయభూమి - దురాక్రమణ - ఒక సమాధి - దానిపై - దేవాలయ - ఆకృతి - నిర్మాణం - దేవాదాయశాఖ - అధికారికి - లీగల్ నోటీస్ - పంపిన - హైందవశక్తి.

వై.యస్.ఆర్ కడప జిల్లా, చింత కొమ్మదిన్నె మండలం, బుగ్గలేటి పల్లె గ్రామంలో ((కడప-రాయచోటి జాతీయ రహదారి నుంచి కొత్తపేట గంగమ్మ గుడికి వెళ్లే రోడ్డు పక్కనే)) గంగమ్మ గుడికి సమీపంలోనే, ఇదే గుడికి ; సర్వే నంబర్ 22-2(ఎల్పీ నెంబర్లు: 185,187లలో) 2.42 ఎకరాలు పొలం ఉంది. ఈ ప్రదేశం లో పురాతన శివలింగానికి ""వనం రామేశ్వర స్వామి"" గుడి పేరిట భక్తులు పూజలు చేసుకుంటుంటారు. పక్కనే పార్వతీదేవిగుడి, ఆ పక్కనే ఆంజనేయ స్వామి గుడి, అక్కమహాదేవి గుడి వగైరాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా, కడప టౌన్ - అక్కయపల్లె నివాసి ఐన శ్రీ రామలింగారెడ్డి గారు 9 సం!!ల క్రితం మరణించిన తన కుమారుడి జ్ఞాపకార్ధం, ఇదే గంగమ్మ గుడికి చెందిన స్థలం దురాక్రమణ చేసి, అప్పట్లోనే  అతనికి సమాధి కట్టించారని : ఈ మధ్య కాలంలో సదరు సమాధి పైన మండపం కూడా కట్టారు అని స్థానిక కార్యకర్తల ద్వారా మన "హైందవశక్తి"-వ్యస్థాపక అధ్యక్షులు శేడింబి.ప్రసాద్ గారికి తెలిసింది.

స్థానిక భక్తులు పై దేవాలయాల దర్శనంతో పాటుగా, ఈ సమాధి - దానిపై నిర్మాణాన్ని చూసి, అది మరొక దేవాలయం అని భ్రమపడి దర్శనానికి వెళుతున్నారని, ఆ తర్వాత భయ బ్రాంతులకు గురి అవుతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేపధ్యంలో మన "హైందవశక్తి"-వ్యస్థాపక అధ్యక్షుల వారి సూచన మేరకు న్యాయ సలహా విభాగం జాతీయ అధ్యక్షులు ధూపం.జీ, చింతకొమ్మ దిన్నె గంగమ్మతల్లి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. సదరు ఈ.ఓ.వారు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మన "హైందవశక్తి" తదుపరి కార్యచరణ ఉండబోతోంది.

Advertisement

అందుకే మనమంటాము…

"హైందవశక్తి" అంటే పోరాటం……

పోరాటం అంటేనే "హైందవశక్తి"…

Advertisement

ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి. మా నెంబర్ 8096311785.

Join హైందవశక్తి 092467 30838