ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా

అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా

Advertisement

తోలు గట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా

రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హరహరహర
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా..