సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

పూర్వ పద్ధతి పంచాంగ సమాచారం
📅 తేది : 13-11-2025 (బృహస్పతివాసరే / గురువారం)
━━━━━━━━━━━━━━━━━━━
గమనిక:
ఇక్కడ ఇవ్వబడిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం లేదా మీ గురువు చెప్పిన విధానానికి అనుగుణంగా దీనిని మార్చుకోవచ్చు.
🕉️ సంధ్యావందన సంకల్పం
శుభాభ్యుదయార్ధంచ,
శుభే శోభనే ముహూర్తే,
శ్రీ మహావిష్ణు రాజ్ఞేయా ప్రవర్తమానస్య,
అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,
మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే (హైదరాబాద్‌లో వారికి మాత్రమే), గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే, శ్రీలక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా హరిహర గురు గోబ్రాహ్మణ చరణ సన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, కృష్ణ పక్షే, నవమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథి చెప్పుకోవాలి – సంధ్యావందనాలకు మాత్రమే)
గురు వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ,
శ్రీమాన్ ____ గోత్రః, ____ నామధేయః, శ్రీమతః ____ గోత్రస్య ____ నామధేయస్య, మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే.
📿 (సంధ్యావందనానికి మాత్రమే)
🌺 ఇతర పూజల కొరకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, కృష్ణ పక్షే నవమ్యాం,
గురు వాసరే అని చెప్పుకోవాలి.
📜 ఇతర ఉపయుక్త వివరాలు
- సూర్యోదయం – ఉదయం 6.07
- సూర్యాస్తమయం – సాయంత్రం 5.21
- శాలివాహన శకం: 1947
- విక్రమ శకం: 2082
- కలియుగ సంవత్సరం: 5126
- సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
- దక్షిణాయన పుణ్యకాలం – శరదృతువు
- మాసం: కార్తీక మాసం
- పక్షం: కృష్ణ పక్షం
- తిథి: నవమి (తె. 3.31 వరకు)
- వారం: గురువారం
- నక్షత్రం: మఘ (రా. 12.22 వరకు)
- వర్జ్యం: మధ్యాహ్నం 12.20 నుండి 1.56 వరకు
- అమృత కాలం: రాత్రి 9.58 నుండి 11.34 వరకు
- దుర్ముహూర్తం:
- ఉదయం 9.51 నుండి 10.36 వరకు
- మధ్యాహ్నం 2.21 నుండి 3.06 వరకు
- యోగం: బ్రహ్మ యోగం (మ. 12.38 వరకు)
- కరణం: తైతుల (మ. 3.46 వరకు), గరజి (తె. 3.31 వరకు)
☀️ సూర్యోదయము ఉదయం 6.00 గంటలకు అయితే
- రాహు కాలం: మధ్యాహ్నం 1.30 – 3.00 వరకు
- గుళిక కాలం: ఉదయం 9.00 – 10.30 వరకు
- యమగండ కాలం: ఉదయం 6.00 – 7.30 వరకు
🌿 పుణ్య తిథి
కార్తీక బహుళ నవమి
🙏 ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070
📞 80195 66579 | 73968 67592 | 98487 51577
మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి.
ఈ రోజు పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అందరికీ —
గాయత్రీ మాత ఆయురారోగ్యాలు, సర్వదా శుభఫలితాలు ప్రసాదించుగాక.
🌼 మీ శ్రేయోభిలాషి 🌼
