శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏

మహానుభావుడు హనుమ మాటవలన భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో స్వామి హనుమ స్థితి, ఆయన బుద్ధిని చూసి, మాటవైభవము చూసి గ్రహించవలసి ఉంటుంది.
మహానుభావుడు హనుమ మాటవలన భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో స్వామి హనుమ స్థితి, ఆయన బుద్ధిని చూసి, మాటవైభవము చూసి గ్రహించవలసి ఉంటుంది. హనుమ అంటే మాట. ఎవరు హనుమను స్మరిస్తారో, ఎవరు హనుమను నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్ పటుత్వము అబ్బుతుంది.
హనుమ సన్యాసి వేషములో మొదటిసారిగా రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళారు. రామలక్ష్మణులను చూడగానే అద్భుతమైన స్తోత్రము చేసారు. ప్రప్రధమ సమావేశములో హనుమ మాటలు విని, ఆ వాగ్వైభావము చూసి
రాముడు నా సృగ్వేదవినీతస్య నా యజుర్వేదధారిణః | నా సామవేదవిదుషః శక్యమేనం ప్రభాషితుం |
చూడు లక్ష్మణా! ఎలా మాట్లాడాడో! ఆ మాట తీరు చూడు! ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడ లేడు. అనగా ఆయన ఉద్దేశ్యము సామవేదము శాంతిని ఇస్తుంది. యజుర్వేదము మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహమును క్రతు రూపములో సాధించిపెడుతుంది. ఋగ్వేదము సూక్త రూపములో ఉంటుంది. ఆ మూడూ ప్రసన్నము చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉన్నది. వాటిని సమగ్రముగా విచారణ చెయ్యనివాడు కార్య సాధకుడై ఇలా మాట్లాడలేడు అని ఎంతో కోపముతో ఉండి కత్తి ఎత్తిపెట్టి చంపేద్దామని పొడిచేస్తున్నవాడు కూడా ఇటువంటి
వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట? ఎటువంటి వాగ్వైభవము? ఈయనను అభినందించాలి ఆదరించాలి. హనుమ మాటల వలన రామ లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది.
స్వామి హనుమను ఆరాధన చేస్తే శ్రీ రామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్లే. రామచంద్రమూర్తిని ఆరాధన హనుమను చేసినట్లే.
రామచంద్రమూర్తి గుణగానము చెప్పబడిన చోట, రామ నామమును చెప్పినా, రామ వైభవము కీర్తించినా హనుమ ప్రసన్నులు అవుతారు. ఎక్కడ రామకధ చెప్పబడుతుందో అక్కడ హనుమ అనుగ్రహప్రదాత అయి ఉంటాడు. హనుమ గూర్చి మాట్లాడుతున్నచోట సీతారాములు ఉంటారు.
హనుమ అత్యద్భుతమైనటు వంటి రీతిలో కనబడేటటువంటి సుందరకాండకి పెద్దలు ఒక మాట చెబుతారు. ఏదైనా జీవితంలో జటిలమైనటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్ధం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసికొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురుపుల్లను తీసికొచ్చి కళ్ళు మూసుకొని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురుపుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ " సమస్యకి పరిష్కారం రామాయణం కధాంతర్గతంగా మీకు దొరుకుతుంది.
హనుమ పరబ్రహ్మస్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నెనా కటాక్షిస్తారు. ఎక్కడ ఆయన పేరు చెప్పితే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెపితే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెపితే అక్కడ శుభం. హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషపడరు. రామనామం చెపితే సంతోషిస్తారు. అది ఆయనకున్న గొప్పదనం. తనని పొగిడితే కాదు, రాముడిని పొగిడితే చాలు, పరవశించిపోతారు..
హనుమ లాంటి మహానుభావుడు, ఆయనంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడు. హనుమ విషయంలో మీరు ఎదురుకుండా ఒక మూర్తిని పెట్టుకొని పూజ చెయ్యనవసరంలేదు. భయమేసిందనుకోండి ఎప్పుడైనా! ఒక చీపురుపుల్ల తీసి మీకెదురుకుండా రాయి కనబడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుక మీదో, నేల మీదో అది పడిందా, లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెపుతుంది శాస్త్రం.
ముఖం నాసికయాతస్య తామ్రాయా తామ్రమాబభౌ |
సంధ్యా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలమ్ ||
సంధ్యాకాలములో ఉండే సూర్యమండలము ఎలా ఉంటుందో స్వామిహనుమ యొక్కముఖ మండలము అలా ఉంటుంది. సంధ్యా కాలము ఆకాశము ఎటువంటి మంగళములు ఇవ్వడానికి ఎటువంటి దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని కలిగి ఉంటుంది. అందుకే ఆయనయొక్క ముఖము నోరు ఎర్రగా పగడముల ముద్దలా ఉంటుంది. అలా ఉన్న ముఖమండలము చూస్తే అది పరమ మంగళము ఇవ్వగలుగుతుంది
హనుమాన్ చాలీసా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర 1
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా 2
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ 3
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా 4
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై 5
శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన 6
విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర 7
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా 8
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా 9
భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే 10
లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే 11
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ 12
సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై 13
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా 14
యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే 15
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా 16
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా 17
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ 18
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ 19
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే 20
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే 21
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా 22
ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంక తే కాంపై 23
భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై 24
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా 25
సంకట సేఁ హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై 26
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా 27
ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై 28
చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా 29
సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే 30
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా 31
రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా 32
తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై 33
అంత కాల రఘువర పురజాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ 34
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ 35
సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా 36
జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవ కీ నాయీ 37
జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ 38
జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా 39
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా 40
'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే' ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ .
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏




