భగవంతుణ్ణి అర్చించడానికి - నిజమైన అష్టదళ పుష్పాలు

అహింస ప్రథమం పుష్పం!పుష్పం ఇంద్రియ నిగ్రహః !!సర్వ భూత దయా పుష్పం !క్షమా పుష్పం విశేషతః !!జ్ఞాన పుష్పం తప: పుష్పం !శాంతి పుష్పం తథైవ చ !!సత్యం అష్ట విధం పుష్పో: !విష్ణో హో ప్రీతి కరం భవేత్ !! అహింసా పుష్పం:ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుం
అహింస ప్రథమం పుష్పం!
పుష్పం ఇంద్రియ నిగ్రహః !!
సర్వ భూత దయా పుష్పం !
క్షమా పుష్పం విశేషతః !!
జ్ఞాన పుష్పం తప: పుష్పం !
శాంతి పుష్పం తథైవ చ !!
సత్యం అష్ట విధం పుష్పో: !
విష్ణో హో ప్రీతి కరం భవేత్ !!
అహింసా పుష్పం:ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.
ఇంద్రియ నిగ్రహం:చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.
దయ :కష్టాల్లో, బాధలో ఉన్నవారిబాధను తొలగించడానికి చేసేదే దయ…..ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.
క్షమ :ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ….ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.
ధ్యానం:ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం….ఇది దేవుని అందించే ఐదో పుష్పం.
తపస్సు :మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు…..ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం
జ్ఞానం:పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం….ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.
సత్యం : ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం…. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.




