మనమంతా ప్రతిరోజూ భగవంతుడిని ఆరాధిస్తూ, పూజలు చేస్తూ, ఆయన అనుగ్రహం పొందాలనే తపనతో ఎన్నో విధాలుగా ఆచారాలు పాటిస్తుంటాము.
కానీ ఒకసారి ఈ కథనం చదివితే —
మన పూజ నిజమైన భక్తితోనా?
లేక అనవసరమైన చాదస్తం, ఆర్భాటాల కోసమా?
అనే ప్రశ్న మన మనసులో స్పష్టంగా వెలుగుతుంది.

పూజా నియమాలు తెలుసుకోవడం మంచిదే.
తప్పులు సవరించుకోవడం ఇంకా మంచిదే.
కానీ “నాకు పర్ఫెక్ట్‌గా రావట్లేదు” అని పూజనే మానేయడం మాత్రం తప్పు.

Advertisement

ఎంత కరుణామూర్తి దేవుడు తెలుసా?


1. భక్త కన్నప్ప కథ

Advertisement

భక్త కన్నప్ప శివుడికి పెట్టిన నైవేద్యం ఏమిటి?
జింకమాంసం!
అతనికి అది పవిత్రమైనది — ఎందుకంటే అతను తన ప్రాణభక్తితో పెట్టాడు.
శివుడు అసహ్యం పడలేదు, “ఇది ఎందుకు పెట్టావు? స్నానం చేశావా?” అని అడగలేదు.
పరమానందంతో స్వీకరించాడు.

అర్థం చేసుకోవాల్సినది:
శివుడికి జింక మాంసం ఇష్టం కాదు.
కన్నప్ప భక్తిని ఇష్టపడ్డాడు.
భక్తితో పెట్టిన ఏదైనా స్వీకారమే.


2. గజేంద్ర మోక్షం

Advertisement

గజేంద్రుడు ప్రాణాపాయ సమయంలో శ్రీహరిని పిలిచాడు.
వైకుంఠంలో ఉన్న స్వామి, శంకు-చక్రాలు కూడా ధరించకుండా, లక్ష్మీదేవికి చెప్పడానికి కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“నువ్వు చిన్నప్పటినుంచి నన్ను పూజ చేయలేదు కదా” అని అడగలేదు.
ఆర్తితో పిలిచినప్పుడు ఆయన వెంటనే స్పందిస్తాడు.

ఇక్కడ అర్థం:
శరణాగతి పరిపూర్ణమైతే —
స్వామి ఏ రూపంలోనైనా వచ్చి రక్షిస్తాడు.


3. ద్రౌపది శరణాగతి

Advertisement

ద్రౌపదిని సభలో అవమానించేటప్పుడు,
ఆమె “కృష్ణా నీవే నా శరణు” అని పూర్తిగా లొంగిపోయిన క్షణంలో —
స్వయంగా వచ్చి ఆమెను రక్షించాడు.

“మూడు రోజుల తర్వాత వస్తా, అప్పటివరకు నన్ను పిలవకు” అని చెప్పలేదు.

ఇక్కడ కూడా అదే ఉపదేశం —
పరమభక్తితో పిలిస్తే దేవుడు వెంటనే స్పందిస్తాడు.


అప్పుడు నిజమైన భక్తి ఏది?

Advertisement

భగవంతుడికి కావాల్సింది హంగారు అలంకారాలు కాదు…
చిన్నా పెద్దా ఆచారాలు కాదు…
ఎటు ముఖం పెట్టాలి, ఎన్ని వత్తులు వేయాలి, ఏ నూనె వాడాలి అన్న చాదస్త నియమాలు కాదు.

ఎది నిజం?

భక్తి ఒక్కటే భగవంతుడికి ప్రీతికరం.

పూజలో చిన్న తప్పులు జరిగితే,
“స్వామీ తెలిసి కాదు, తెలియక జరిగిపోయింది”
అంటే దేవుడు చిరునవ్వుతో మన్నిస్తాడు.

కాని తెలిసి కూడా
దేవుణ్ణి మోసం చేయాలని చేసే పనులు మాత్రం మనల్ని దూరం తీస్తాయి.
ఎందుకంటే ఆయన ముందు దాచివుంచేది ఏమీ లేదు.


గుర్తుపెట్టుకో వలసిన సారాంశం

  • పూజలో ముఖ్యమైనది భక్తి.
  • ఆర్భాటాలు, చాదస్తం దేవునికి అవసరం లేదు.
  • మనస్పూర్తిగా చేసే చిన్న పూజ పెద్ద యాగం కంటే విలువైనది.
  • శరణాగతి నిజమైనదైతే దేవుడు వెంటనే స్పందిస్తాడు.
  • తెలియక చేసిన తప్పులకు ఆయన క్షమించే వాడు.
  • తెలిసే చేసిన ప్రవర్తనలను మాత్రం క్షమించడు.


శుభమస్తు
🙏 శ్రీ సద్గురు పీఠం
🙏 సమస్త లోకా సుఖినో భవంతు