ధ్యానం – మనసు నిలబడే మార్గం

ధ్యానం చేయాలంటే మనసు నిలబడాలి.మనసు నిలబడాలంటే ధ్యానంపై శ్రద్ధ ఉండాలి.శ్రద్ధ కలగాలంటే లక్ష్యం మీద గురి ఉండాలి. లక్ష్యం లేకుండా, పట్టుదల లేకుండా ఎన్నేళ్లు ధ్యానం చేసినా ఫలితం శూన్యం. చేయాలనే సంకల్పం ఉన్నా…గురి ఉన్నా…మనసు మాత్రం మాట వినడం లేదు
ధ్యానం చేయాలంటే మనసు నిలబడాలి.
మనసు నిలబడాలంటే ధ్యానంపై శ్రద్ధ ఉండాలి.
శ్రద్ధ కలగాలంటే లక్ష్యం మీద గురి ఉండాలి.
లక్ష్యం లేకుండా, పట్టుదల లేకుండా ఎన్నేళ్లు ధ్యానం చేసినా ఫలితం శూన్యం.
చేయాలనే సంకల్పం ఉన్నా…
గురి ఉన్నా…
మనసు మాత్రం మాట వినడం లేదు.
కూర్చోగానే ఎన్నో ఆలోచనలు, ఎన్నో సన్నివేశాలు ముందు వరుసగా వస్తూనే ఉంటాయి — ఇదే చాలా మందికి బాధ.
మనస్సు కుదురుకోడానికి ఒకే ఒక్క మార్గం ఉంది:
సత్సంగం – సద్గురువుల బోధనలు
వాటిని నిత్యం వినాలి, మనం అనుసరించాలి, సత్సంగతిలో ఉండాలి.
ఆలయానికి వెళ్లి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చోవాలి.
మనసులో వచ్చే ఆలోచనల్లను పక్కకు నెట్టేసి ధ్యానంపై దృష్టి పెట్టాలి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తూ చేస్తూ ఉండగా —
మనసు నెమ్మదిస్తుంది. నిలకడ పెరుగుతుంది.
ధ్యానం సులభమవుతుంది.
అనుకునగానే ఏది రాదు.
ధ్యానం క్రమశిక్షణ; ఫలితం క్రమసాధన.
ఇంట్లో చేస్తే కుదరడం లేదు…
ఎప్పుడు ఏదో సమస్య… గొడవలు… అశాంతి.
కాబట్టి దూరంగా వెళ్లి ఉండాలి అనుకునేవారు ఒక విషయం తెలుసుకోవాలి —
ఎక్కడికి వెళ్లినా మనిషి అవసరం తప్పదు.
అక్కడ కూడా సంబంధాలు ఏర్పడతాయి.
అభిప్రాయాలు కలవక ఇబ్బందులు వస్తాయి.
అదన్నమాటికి, మనం ఉన్నచోటే —
అక్కడివారికి ఇబ్బంది కాకుండా, మనకీ ఇబ్బంది కాకుండా,
సమస్యలు వచ్చినా వాటిని మనమే పరిష్కరించుకుంటూ,
ప్రతి ఒక్కరితో సర్దుకుపోతూ,
మన లక్ష్యాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటే…
పరిస్థితులూ, మనసూ — రెండూ నెమ్మదిగా మన లక్ష్యం వైపు నడిపిస్తాయి.
జీవితంలో ఏది శాశ్వతం కాదు.
మనిషైనా… అనారోగ్యమైనా… వస్తువైనా…
వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది.
ఓపిక ఉంటే ఉండాల్సినవి ఉంటాయి.
పోయే కారణమున్నవి పోతాయి.
చిన్నప్పటి ఇష్టాలు మరిగిపోయాయి.
ఇష్టపడినవి మారిపోయాయి.
మనుషులు, వస్తువులు, జంతువులు, చెట్లు —
చుట్టూ ఎంత మార్పు వచ్చిందో!
“ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు” అనే స్పృహ ఎప్పుడూ మనసులో ఉంటే —
మనసు ఎక్కడికీ పరిగెత్తదు.
స్థిరంగా, సాంతంగా ఉంటుంది.
– శ్రీ సద్గురు పీఠం



