తన మనసును కోరికల కొంపగా కాదు,ప్రేమ–భక్తి–విశ్వాసాల గంపగా మార్చుకోవాలి…

ఒకసారి రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడి చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది కదా ఆ వేణువు…
ఆ వేణువును చూసి స్నేహంగా అడిగిందట:

Advertisement

“కన్నా నిన్ను ఇంత ప్రేమతో విడవకుండా పట్టుకుంటాడు…
పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేశావో చెప్పవయ్యా?”

అందుకు వేణువు మృదువుగా నవ్వి ఇలా అంటుందట—

Advertisement

“నాలోపల డొల్ల తప్ప ఇంకేమీ లేదు అమ్మా…
అదే ‘ఏమీ లేకపోవడం’
నన్ను ఆ ఆనಂದకిశోరునికి దగ్గర చేసింది.”

దీని అసలు రహస్యం ఏమంటే —

ఎవరైతే
ప్రాపంచిక ఆలోచనలను, ఆశలను, అహంకారాలను
మనసు అనే పాత్రలోంచి పూర్తిగా తీర్చేస్తారో…
మనసును శూన్యంగా, స్వచ్ఛంగా ఉంచుకుంటారో…

Advertisement

వారిలోనే శ్రీమాధవుడు సుఖంగా నివసిస్తాడు.
ఆ హృదయమే ఆయన ఆలయం అవుతుంది.
ఇదే ఆయన అనుగ్రహానికి నిజమైన ద్వారం.

ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుని ఆచరిస్తే —
ఇంకా పెద్ద పెద్ద సాధనల అవసరం లేదు.
ఏకమైన హృదయం చాలు…
అది ఉన్నచోటే అనుగ్రహం వెలిగిపోతుంది.

శుభమస్తు
🙏 శ్రీ సద్గురు పీఠం
సమస్త లోకాః సుఖినో భవంతు