భగవంతుని పై విశ్వాసం ఎలా వుండాలి?

మనమెలా చూస్తామో, అలా భగవంతుని అనుగ్రహమూ ఉంటుంది.
మనమెలా చూస్తామో, అలా భగవంతుని అనుగ్రహమూ ఉంటుంది.
దీనిని ఒక చిన్న సంఘటన ద్వారా పరిశీలిద్దాం…
ఒక భారతీయుడు మరియు ఒక ఆంగ్లేయుడు గోదావరి నదిలో స్నానం చేశారు.
భారతీయుడు తన శరీరమూ, మనసూ పరిశుద్ధమయ్యాయని భావించి ఎంతో ఆనందించాడు.
ఆ అవకాశం దక్కడం తనకు మహాదృష్టమని భావించాడు.
దాన్ని చూసిన ఆంగ్లేయుడు నవ్వుతూ చెప్పాడు:
“అయ్యో! ఇది కేవలం రెండు పాళ్ళు హైడ్రోజన్, ఒక పాలు ఆక్సిజన్ కలిసిన నీరు మాత్రమే. ఇందులో మునిగితే ఇంత చెప్పలేని ఆనందం నీకు ఎలా కలుగుతుంది?”
ఆంగ్లేయునికి కేవలం బాహ్య శుభ్రత మాత్రమే లభించింది.
కాని నమ్మిన భారతీయునికి ఆంతరంగిక శుభ్రత కూడా లభించింది.
ఎలా?
ఎందుకంటే ఆత్మశుద్ధికి కావలసినది భక్తి మరియు విశ్వాసం.
దైవంపై ఉన్న విశ్వాసమే మన హృదయానికి సంబంధించినది.
ఆ విశ్వాసం మానవతా విలువల రూపంలో వ్యక్తమౌతుంది—
శాంతి, ప్రేమ, ధర్మం, సత్యం.
అవిశ్వాసం మాత్రం మనసులో లోభం, మత్సరం, కామం, క్రోధం అనే అరిషడ్వర్గాల రూపంలో వ్యక్తమవుతుంది.
ఇవన్నీ కలిగిన మనిషి ముఖంలో ఎప్పటికీ ప్రశాంతత కనిపించదు.
భగవంతుడు ఉన్నాడని నమ్మిన వానికి — అన్నీ ఉన్నాయి.
లేడని చెప్పిన వానికి — ఏమీ లేదు.
నమ్మిన వాడికి సొమ్ము
నమ్మని వాడికి దుమ్ము
శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు
శ్రీ సద్గురు పీఠం నుండి




