భక్తుడు భగవంతుణ్ణి - ఎలా ప్రార్ధించాలి??```

ఈరోజు చాలా మంది,
ఏదో పారాయణ తోనో, పూజలతోనో,
నోములతోనో,
మరే ఇతర సాధనలతోని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు…

Advertisement

మనము ప్రార్థన అయితే చేస్తున్నాము కానీ,
అది ఎలా చేయలో,
ఎందుకు చేయాలో తెలుసుకోవడము లేదు.

మనము మన స్వలాభాల కోసం ప్రార్థనలు చేస్తున్నామే తప్ప లోక శ్రేయస్సు కొరకు కొంచెం కూడా చేయడం లేదు!!…

Advertisement

ఇంకా షరతులతో కూడిన ప్రార్థనలు చేస్తున్నాము, కానీ ప్రేమతో, ఆర్తితో చేయడం లేదు.
మనము ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమిటంటే, “ప్రార్థన అంటే భగవంతునితో సంభాషణ చేయడం తప్ప కోరికలు కోరడం కాదు!”…

కష్టమెుచ్చినా,
సుఖమెుచ్చినా '
అంతా భగవంతునిదే,
ఆయన సంకల్పమే నెరవేరుగాక!' అని అనుకోవాలి తప్ప నాకు ఇది చేయండి, అది చేయండి అంటూ విలపించడం భక్తి కాదు!!

భగవంతుడిని నిబంధనలు లేకుండా శరణాగతి భావంతో భగవంతుని ప్రార్థించాలి!

Advertisement

అపుడు భగవంతుడు నిత్యమూ మన ఇంటా, వెంటా ఉంటూ ప్రహ్లాదునివలే మనలను సదా రక్షిస్తుంటాడు…

ఇది సత్యం…``

స్వస్తి….✍️

Advertisement

శుభమస్తు
🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా….✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏

శుభమస్తు
🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా….✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏