మానవుని మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొని … ఆనందం అనుభవించేది ఎలా????*

మనిషి ఆనందం కోసం బయట వెతుకుతున్నాడు. కానీ సుఖ–దుఃఖాలు బయటివి కావు, మన మనస్సులో నుండే ఉద్భవిస్తాయి. బాధ మన నుండే వస్తే, ఆనందం కూడా మన నుండే రావాలి.

Advertisement

మనలోనే ఉన్న ఆనందం కనిపించకపోవడానికి కారణం మనస్సులోని మాలిన్యాలు. ముఖ్యంగా రెండు తలంపులు —
*‘నేను’ (అహంకారం), *‘నాది’ (మమకారం)**. ఇవి తొలగితేనే జీవుడు దేవునికి దగ్గరవుతాడు.

పూజకు ముందు దేవాలయంలో నిర్మాల్యం తొలగించినట్టే, హృదయంలోని అజ్ఞాన నిర్మాల్యాన్ని తొలగించాలి.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలే ప్రధాన అడ్డంకులు.

Advertisement

వాటిని తొలగించడానికి —
సత్కర్మలు, సత్సంగం, భగవన్నామస్మరణ, సేవ, శుద్ధాహారం (ఇంద్రియాల ద్వారా గ్రహించేదీ కలిపి) అవసరం.

భగవంతుడు బయట కాదు, హృదయంలోనే ఉన్నాడు అని రమణ మహర్షి చెబుతారు.
మనస్సు శుద్ధమైతే అదే దర్శనం.

నిజమైన ఆనందానికి రెండు మాత్రమే అవసరం — ప్రేమ, జ్ఞానం.
ఈ రెండూ కలిసినప్పుడే ఏకత్వం, శాంతి, ఆనందం. సిద్ధిస్తుంది

Advertisement

*శుభమస్తు

🙏 శ్రీ సద్గురు పీఠం 

సమస్త లోకా సుఖినోభవంతు🙏🏻