పాపాన్ని పుణ్యం చేత తగ్గించడం సాధ్యమా?

ఇది చాలామందికి ఒక పెద్ద సందేహం.

Advertisement

అలా సాధ్యం కాదు.

ముళ్ళ మొక్కల బీజాలనూ, పళ్ల మొక్కల బీజాలనూ కలిపి ఎంత బాగా గిలకరించి విత్తినప్పటికీ, ముళ్ళ విత్తనం ముళ్ళ మొక్కగానే, పళ్ల విత్తనం పళ్ల మొక్కగానే పెరుగుతుంది.

అట్లయితే మరి దీనికి పరిహారము లేదా?

Advertisement

వుంటుంది. అది ఎలా అంటే, మీ ఆదాయంలో దానధర్మాలకు ఖర్చు పెడితే అంతమేరకు ఇన్కమ్ ట్యాక్స్ వారు పన్ను తక్కువ చేస్తారు.

అట్లే, ఇక్కడ మనస్సు పెట్టి నామస్మరణ చేస్తే ఇంత, నామ జపం చేస్తే మరికొంత, లిఖిత జపం చేస్తే ఇంకా కొంత, ధ్యానం చేస్తే ఇంత అని తగ్గిస్తారు.

అయితే పూర్తిగా తక్కువ అవదు. మిగిలినది అనుభవించాలి.

Advertisement

భక్తుడు : అట్లయితే మీ దర్శనం వలన మాకు కలిగే ప్రయోజనం ఏమిటి?

ఉరిశిక్ష పడిన ఖైదీకి క్షమాభిక్ష రాష్ట్రపతి ప్రసాదించవచ్చు. జీవిత ఖైదీగా మార్చవచ్చు. అవతార మూర్తి యొక్క అనుగ్రహం దుష్కార్యముల ఫలాల తీవ్రతను తగ్గిస్తుంది.

ఇంటర్వ్యూల వల్ల శాశ్వతమైన సంతోషం మీకు ఉండదు. అందుచేత మీరున్న చోటు నన్ను దర్శించేటట్లు మీరు మారాలి.

'ఇంటర్వ్యూ' కాదు, 'ఇన్నర్ వ్యూ' (అంతర్దృష్టి)ని పొందండి.

శుభంభూయాత్

🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏