శ్రీ వరద గణేశ స్వామి ధ్యానం – విఘ్న నాశనం, ఐశ్వర్య సిద్ధి, మనోబీష్టసిద్ధి
శ్రీ వరద గణేశ స్వామి ధ్యానం – విఘ్న నాశనం, ఐశ్వర్య సిద్ధి, మనోబీష్టసిద్ధి శ్రీ గణేశ అనుగ్రహం విఘ్న నాశనం ,ఐశ్వర్య సిద్ధి , మనోబీష్టసిద్ధి , శాంతి సౌఖ్యములు కోసం శ్రీ వరద గణపతి స్వామి ధ్యానం శ్రీ వరద గణేశ స్వామి ధ్యానం ఓం సింధూరాభమనాది ముక్తమమలం బాలేందు చూడామణిం ।
శ్రీ వరద గణేశ స్వామి ధ్యానం – విఘ్న నాశనం, ఐశ్వర్య సిద్ధి, మనోబీష్టసిద్ధి
శ్రీ గణేశ అనుగ్రహం విఘ్న నాశనం ,ఐశ్వర్య సిద్ధి , మనోబీష్టసిద్ధి , శాంతి సౌఖ్యములు కోసం శ్రీ వరద గణపతి స్వామి ధ్యానం
శ్రీ వరద గణేశ స్వామి ధ్యానం
ఓం సింధూరాభమనాది ముక్తమమలం బాలేందు చూడామణిం ।
వామేనాత్త సరోరుహాంత రలసత్కేలీ కటాక్షేక్షణమ్ ॥
పాశాంకుశాభయ వరదాన్ హస్తైర్దధానం ప్రభం।
ధ్యాయేద్విఘ్న నివారణం గజముఖం లక్ష్మీప్రదం సర్వదా ॥
రూప వర్ణన
సింధూరం వంటి ఎర్రని కాంతితో ప్రకాశించేవాడు, ఆది అంతము లేని ముక్తుడు, నిర్మలుడు మరియు తన శిరస్సుపై బాలచంద్రుడిని (చిన్న చంద్రవంకను) ధరించినవాడు తన ఎడమవైపున ఉన్న లక్ష్మీదేవి ముఖపద్మముపై ప్రేమపూర్వకమైన కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసేవాడు, తన హస్తములలో పాశము, అంకుశము, అభయ ముద్ర మరియు వరద ముద్రలను ధరించి ప్రకాశించేవాడు సమస్త విఘ్నాలను తొలగించేవాడు, గజముఖము కలిగినవాడు మరియు సంపదలను ఇచ్చేవాడు అయిన ఆ వరద గణేశుని ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాను.
ధ్యాన ఫలం
- విఘ్ననాశము (ఆటంకాలు తొలగడం)
- ఐశ్వర్యసిద్ధి (సంపద లభించడం)
- మనోభీష్టసిద్ధి (కోరికలు నెరవేరడం)
- శాంతిసౌఖ్యములు (సుఖసంతోషాలు కలగడం)
ఓం గం గణపతయే నమః 🙏



