భగవంతుని పొందే మార్గం: పంచవిధ భక్తి భావాలు – శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావం
భగవంతుడిని ప్రశాంతమైన మనస్సుతో, ఎలాంటి కోరికలు లేకుండా ఆరాధించడం శాంతభావం. ఋషులు ఈ విధమైన భక్తిని అనుసరించేవారు. భగవంతుని స్మరిస్తూ, ఆయనపై స్థిరమైన ప్రేమతో, మనశ్శాంతితో జీవించడం ఈ భావంలోని ముఖ్య లక్షణం.

భగవంతునిపై ప్రేమ, భక్తి కలగడానికి ఒక్కొక్కరు ఒక్కో విధమైన భావాన్ని అనుసరిస్తారు.
భక్తిలో ప్రధానంగా ఐదు రకాల భావాలు ఉన్నాయి.
అవి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలు.
1. శాంత భావం
భగవంతుడిని ప్రశాంతమైన మనస్సుతో, ఎలాంటి కోరికలు లేకుండా ఆరాధించడం శాంతభావం. ఋషులు ఈ విధమైన భక్తిని అనుసరించేవారు. భగవంతుని స్మరిస్తూ, ఆయనపై స్థిరమైన ప్రేమతో, మనశ్శాంతితో జీవించడం ఈ భావంలోని ముఖ్య లక్షణం.
2. దాస్య భావం
భగవంతుడిని యజమానిగా భావించి, తనను ఆయన సేవకునిగా భావించడం దాస్యభావం. హనుమంతుడు దీనికి గొప్ప ఉదాహరణ. శ్రీరాముని సేవే తన జీవిత లక్ష్యంగా భావించి, ఎలాంటి కష్టానికైనా వెనుకాడకుండా ఆయన కార్యాన్ని నిర్వహించాడు.
3. సఖ్య భావం
భగవంతుడిని తనకు అత్యంత ఆత్మీయమైన స్నేహితునిగా భావించడం సఖ్యభావం. అర్జునుడు, కుచేలుడు ఈ భావానికి ఉదాహరణలు. స్నేహితునితో మనసులోని మాటలను స్వేచ్ఛగా చెప్పుకున్నట్లే, భగవంతునితో కూడా చనువుగా మనసులోని భావాలను పంచుకోవడం ఈ భక్తి ప్రత్యేకత.
4. వాత్సల్య భావం
భగవంతుడిని తన బిడ్డగా భావించి ప్రేమించడం వాత్సల్యభావం. యశోదమ్మ శ్రీకృష్ణుడిని తన బిడ్డగా భావించి ఎంతో ప్రేమతో పెంచింది. కృష్ణుడు వెన్న తింటాడని వెన్న చేత పట్టుకుని ఆయన వెంట తిరిగేది. తల్లి తన బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటుందో, భక్తుడు కూడా భగవంతునిపై అలాంటి మమకారాన్ని చూపించడం ఈ భావం.
5. మధుర భావం
భగవంతుడిని తన ప్రియమైన వ్యక్తిగా భావించి, అత్యంత గాఢమైన ప్రేమతో ఆరాధించడం మధురభావం. రాధాదేవి ఈ భావానికి గొప్ప ఉదాహరణ. ఇందులో భగవంతునిపై సంపూర్ణ ప్రేమ, అంకితభావం, విరహం, నిరంతర స్మరణ ఉంటాయి. మిగిలిన నాలుగు భావాల్లోని ప్రేమ, సేవ, సాన్నిహిత్యం వంటి లక్షణాలు కూడా ఇందులో కనిపిస్తాయి.
ఆధ్యాత్మిక సారాంశం
భక్తిలో ఏ భావం గొప్పది, ఏది తక్కువది అనే భేదం లేదు. మన హృదయానికి ఏ భావం సహజంగా అనిపిస్తుందో, దానితో భగవంతుని ఆరాధించవచ్చు.
భక్తి అంటే కేవలం పూజలు, జపాలు చేయడం మాత్రమే కాదు. మనసును భగవంతునిపై నిలిపి, అహంకారాన్ని తగ్గించుకుని, ప్రేమతో ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవడం.
భావం ఏదైనా, భక్తి నిజమైనదైతే భగవంతుని అనుగ్రహానికి అదే మార్గమవుతుంది..
సౌజన్యం: శ్రీ సద్గురు పీఠం
తరచుగా అడిగే ప్రశ్నలు
భక్తిలో ఐదు భావాలు ఏవి?
శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలు.
దాస్య భావానికి ఉదాహరణ ఎవరు?
శ్రీరాముని సేవే జీవిత లక్ష్యంగా భావించిన హనుమంతుడు.
ఏ భక్తి భావం గొప్పది?
ఏ భావం గొప్పది, ఏది తక్కువది అనే భేదం లేదు. మన హృదయానికి సహజంగా అనిపించే భావంతో, నిజమైన భక్తితో ఆరాధిస్తే అదే భగవదనుగ్రహానికి మార్గం.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- అద్వైత వేదాంతం అంటే ఏమిటి? శంకరుల అద్వైతానికి ప్రారంభ మార్గదర్శి
- అహం బ్రహ్మాస్మి అర్థం: ఇది అహంకారం ఎందుకు కాదు
- తత్ త్వం అసి అర్థం: ఛాందోగ్య ఉపనిషత్తు 6.8.7 వివరణ
- ఆత్మ అంటే ఏమిటి? ఉపనిషత్తులలో ఆత్మ తత్త్వం వివరణ
- ఆత్మ – పరమాత్మ ఒక్కటేనా? సింహం కథ ద్వారా ఆత్మజ్ఞానం, అద్వైత వేదాంత రహస్యం




