చెట్లు... దేవతా నిలయాలు | వృక్షాల ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రాముఖ్యత
🌳 చెట్లు... దేవతా నిలయాలు 🌳 🌿 వృక్ష సంపద – జీవరాశుల ఆధారం భూమ్మీద నివసించే అన్నిరకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే 'వృక్షో రక్షతి రక్షితః' అన్
🌳 చెట్లు... దేవతా నిలయాలు 🌳
🌿 వృక్ష సంపద – జీవరాశుల ఆధారం
భూమ్మీద నివసించే అన్నిరకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే 'వృక్షో రక్షతి రక్షితః' అన్న సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణ వాయువును అందించే సంజీవినులన్నది జగమెరిగిన సత్యం.
ఇవి కూడా చదవండి: నిన్ను నీవు సరిదిద్దుకోవాలి..! | సద్విమర్శతో వ్యక్తిత్వ వికాసం · జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? · మహా కుంభమేళా యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: ఒక పవిత్రమైన కలయిక
🌿 రామాయణం, మహాభారతంలో వృక్షాల ప్రస్తావన
రామలక్ష్మణులు, పాండవులు వనవాసంలో చెట్ల నీడల్లోనే తమ నివాసాల్ని ఏర్పాటు చేసుకున్నారు.
పంచవటి అంటే- అయిదు రకాల మర్రి వృక్షాల మధ్య రాముడు తమ పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడని రామాయణంలో ఉంది.
ఉపవాసం ఉన్న రోజు కొంతమంది మర్రి చెట్టుని పూజిస్తారు.
శమీ అంటే జమ్మి. ఈ చెట్టు శని దేవుడికి ప్రీతికరమైందని, ఆయన అనుగ్రహం కోసం జమ్మి మొక్కని నాటాలంటారు. జమ్మిని పూజించిన తర్వాత ఏ పని తల పెట్టినా విజయం కలుగుతుందని నమ్ముతారు.
🌿 రావి, అశోక మరియు శింశుపా వృక్షాల విశిష్టత
రావి చెట్టులో దేవతలు నివసిస్తారని, అందుకే ఈ చెట్టుని కల్పవృక్షాలలో ఒకటని చెబుతారు.
బృహత్ సంహిత, బ్రహ్మపురాణం, తైత్తిరీయోపనిషత్ లాంటి వాటిలోను, బౌద్ధ రచనలలోను జ్ఞాన ఛత్రంగా పిలిచే బోధి వృక్షం (రావి చెట్టు) ప్రస్తావన ఉంది.
నేడు అశోక వృక్షాలుగా పిలుస్తున్నవి రామాయణ కాలం నాటి అశోకవృక్షాలు కావు.
'అశోక' అంటే శోకం లేని, మానసికోల్లాసం కలిగించేదని అర్థం.
అశోకవనంలో సీతాదేవికి నీడనిచ్చింది శింశుపా వృక్షం (ఇరుగుడు చెట్టు). దీన్ని 'తామ్ర పల్లవి' అనీ అంటారు.
బుద్ధుడు పుట్టింది కూడా ఈ వృక్షం కిందేనని కొన్ని బౌద్ధ కథలు చెబుతాయి. కోసంబి నగరంలో శింశుపా వృక్షం కిందే బుద్ధుడు బోధనలు చేసేవాడట.
🌿 కృష్ణుడు, శివుడు మరియు పవిత్ర వృక్షాలు
ఇక శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని (మారేడు) అయితే ఔషధాల గని అనవచ్చు.
అల్లరి చేస్తున్న బాల కృష్ణుడికి శిక్షగా రోటికి కట్టేసింది యశోద. ఆ దుడుకు చిన్నవాడు మద్ది వృక్షాల మధ్య నుంచి రోటిని ఈడ్చుకుంటూ పోయాడు. అంత పెద్ద మానులు అతడి ధాటికి ఫెళఫెళమంటూ కూలి ఇద్దరు గంధర్వులకు శాపవిముక్తి కలిగినట్లు భాగవతం చెబుతోంది.
అవతారం పరిసమాప్తి సమయంలో కృష్ణుడు 'అస్త' వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా వేటగాడు బాణాన్ని ప్రయోగించాడని చెబుతారు.
వేప చెట్టును అమ్మవారికి ప్రతీకగా భావించి కొలుస్తారు.
వటవృక్షం విష్ణుమూర్తికి ఆశ్రయమిచ్చినందున ఆయనను వటపత్రశాయిగా పూజిస్తాం.
తులసి మొక్కను ఇంట్లో నిత్యం అర్చిస్తే- కార్తికంలో ఉసిరి చెట్టు పూజనీయమవుతుంది.
🌿 దత్తాత్రేయుడు మరియు ఔదుంబర వృక్షం
త్రిభువనాలకు గురువైన దక్షిణామూర్తి వటవృక్ష మూలమందు కూర్చున్నట్టు పురాణాలు వర్ణించాయి.
గురు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబరం (మేడి). ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తుడు ఆ ఇంట్లో ఉన్నట్లేనని భక్తుల నమ్మకం.
🌿 ప్రకృతి పరిరక్షణ మన బాధ్యత
మనం కొలిచే దేవతలంతా ఇలా చెట్లకు ఎంతో విలువిచ్చారు.
మనిషి కూడా ఆ విషయం గుర్తుంచుకుని మసలుకోవాలి.
ప్రకృతిని కాపాడుకోవాలి.
🌺 సందేశం 🌺
వృక్షాలు కేవలం నీడనిచ్చే చెట్లు మాత్రమే కావు...
అవి జీవానికి ఆధారం, సంస్కృతికి చిహ్నం, దేవతల నిలయాలు.
🌿 వృక్షో రక్షతి రక్షితః 🌿
🙏 శుభమస్తు 🙏
తరచుగా అడిగే ప్రశ్నలు
శని దేవుడికి ప్రీతికరమైన చెట్టు ఏది?
జమ్మి (శమీ) చెట్టు శని దేవుడికి ప్రీతికరమైందని, ఆయన అనుగ్రహం కోసం జమ్మి మొక్కను నాటాలని చెబుతారు. జమ్మిని పూజించిన తర్వాత ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుందని నమ్ముతారు.
రావి చెట్టును ఎందుకు పవిత్రంగా భావిస్తారు?
రావి చెట్టులో దేవతలు నివసిస్తారని, అందుకే దీన్ని కల్పవృక్షాలలో ఒకటిగా చెబుతారు. జ్ఞాన ఛత్రంగా పిలిచే బోధి వృక్షం (రావి) ప్రస్తావన బృహత్ సంహిత, బ్రహ్మపురాణం, తైత్తిరీయోపనిషత్, బౌద్ధ రచనలలో ఉంది.
అశోకవనంలో సీతాదేవికి నీడనిచ్చిన చెట్టు ఏది?
అశోకవనంలో సీతాదేవికి నీడనిచ్చింది శింశుపా వృక్షం (ఇరుగుడు చెట్టు), దీన్ని 'తామ్ర పల్లవి' అని కూడా అంటారు. నేడు అశోక వృక్షాలుగా పిలుస్తున్నవి రామాయణ కాలం నాటి అశోకవృక్షాలు కావు.
దత్తాత్రేయునికి ప్రీతికరమైన వృక్షం ఏది?
గురు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబరం (మేడి). ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తుడు ఆ ఇంట్లో ఉన్నట్లేనని భక్తుల నమ్మకం.
పంచవటి అంటే ఏమిటి?
ప్రచారంలో ఉన్నట్లుగా, అయిదు రకాల మర్రి వృక్షాల మధ్య రాముడు తన పర్ణశాలను ఏర్పాటు చేసుకున్న ప్రదేశమే పంచవటి అని రామాయణంలో ఉంది.
'వృక్షో రక్షతి రక్షితః' అనే సూక్తి ఎందుకు ఏర్పడింది?
భూమ్మీద నివసించే అన్ని ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం కాబట్టే ఈ సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణ వాయువును అందించే సంజీవినులు, అందుకే ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- శ్రీ సద్గురు పీఠం తరపున దీపావళి శుభాకాంక్షలు – స్వాతి నక్షత్ర యుక్త ఆశ్వయుజ అమావాస్య
- భక్తికి మూలం హృదయ పరివర్తన – శ్రీ సద్గురు పీఠం
- భగవంతుని పొందే మార్గం: పంచవిధ భక్తి భావాలు – శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావం
- శుభకార్యాల్లో భోజనాలు ఎందుకు పెడతారు? అన్నదానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
- ప్రేమకు, అనుబంధానికి తేడా ఏమిటి? వేదాంతం చెప్పే నిస్వార్థ ప్రేమ, విశ్వప్రేమ


