🌿 నిన్ను నీవు సరిదిద్దుకోవాలి..! 🌿

సాధనలో ముందుకు సాగాలంటే ముందుగా మనల్ని మనం సరిదిద్దుకోవడం అవసరం.

✨ అది ఎలా?

ఇవి కూడా చదవండి: చెట్లు... దేవతా నిలయాలు | వృక్షాల ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రాముఖ్యత · జీవితంలో ఒక్కసారైనా MBBS పూర్తి చేయాలి | మహాభారతం, భాగవతం, భగవద్గీత, రామాయణం మహిమ · శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి ధ్యానం | సుమేధస్సు, వాక్చాతుర్యం, ఆత్మజ్ఞానం కోసం ధ్యాన శ్లోకం

🔹 నీలో లేని తప్పుల గురించి ఎవరైనా మాట్లాడితే బాధపడవద్దు.

🔹 కానీ, నీలో ఉన్న లోపాలను ఇతరులు చెప్పేలోపే గుర్తించి సరిచేసుకోవడానికి ప్రయత్నించు.

🔹 నీ తప్పులను నీకు తెలియజేసేవారిపై కోపం గానీ, ద్వేషం గానీ పెంచుకోకు.

🔹 వారు నీ లోపాలను చూపిస్తున్నారంటే, నీ అభివృద్ధికి సహాయం చేస్తున్నట్టే. అందుకే వారికి కృతజ్ఞతతో ఉండాలి.

🔹 అలా కాకుండా, నీ తప్పు చెప్పిన వారిలో తప్పులు వెతకడం ప్రారంభిస్తే, అది మరింత పెద్ద తప్పు అవుతుంది.

Advertisement

🔹 నీ తప్పులను నీవు తెలుసుకోవడంలో మేలు ఉంది.

🔹 కానీ, నీ తప్పును చెప్పిన వారి తప్పులను వెదకడంలో ఎలాంటి ప్రయోజనం లేదు.


🌼 నేడు మనం చేస్తున్నది ఏమిటి?

ఎవరైనా మనలను పొగిడితే వారిని ఆకాశానికెత్తేస్తాం.

అదే మన లోపాలను చెబితే వారిపైనే విమర్శలు చేస్తాం.

"వారు ఇలా చేయడం లేదు, వారు అలా చేయడం లేదు" అని వాదిస్తాం.

కానీ నిజమైన సాధన అంటే మన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ మంచి మార్గంలో ముందుకు సాగడం.


🌟 జీవన సత్యం

మనలను మార్చేది ప్రశంస కాదు...

మనలను మెరుగుపరచేది సద్విమర్శ....


🌺 శుభమస్తు 🌺

✍️ శ్రీ సద్గురు పీఠం ద్వారా...

తరచుగా అడిగే ప్రశ్నలు

మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి?

మనలో ఉన్న లోపాలను ఇతరులు చెప్పేలోపే గుర్తించి సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. మన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ మంచి మార్గంలో ముందుకు సాగడమే నిజమైన సాధన.

మన తప్పులు చెప్పినవారిపై కోపం ఎందుకు పెంచుకోకూడదు?

మన లోపాలను చూపించేవారు మన అభివృద్ధికి సహాయం చేస్తున్నట్టే. అందుకే వారిపై కోపం, ద్వేషం పెంచుకోకుండా కృతజ్ఞతతో ఉండాలి.

మనలో లేని తప్పుల గురించి ఎవరైనా మాట్లాడితే ఏం చేయాలి?

మనలో లేని తప్పుల గురించి ఎవరైనా మాట్లాడితే బాధపడవద్దు. మనలో నిజంగా ఉన్న లోపాలను గుర్తించి సరిచేసుకోవడంపైనే దృష్టి పెట్టాలి.

తప్పు చెప్పినవారిలో తప్పులు వెతికితే ఏమవుతుంది?

మన తప్పు చెప్పినవారిలో తప్పులు వెతకడం ప్రారంభిస్తే అది మరింత పెద్ద తప్పు అవుతుంది. మన తప్పులను మనం తెలుసుకోవడంలోనే మేలు ఉంది, వారి తప్పులు వెదకడంలో ఎలాంటి ప్రయోజనం లేదు.

ప్రశంస కంటే సద్విమర్శ ఎందుకు మేలు?

మనలను మార్చేది ప్రశంస కాదు, మెరుగుపరచేది సద్విమర్శ. పొగిడినవారిని ఆకాశానికెత్తి, లోపాలు చెప్పినవారిని విమర్శించడం సాధనకు అడ్డంకి.