⚜️ దారిద్ర్యం అంటే ఏమిటి? ⚜️

🌿🌿🌿🥀🥀🥀🍂🍂🍂

❗ దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడంకాదు. ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్నదానితో తృప్తిలేకుండ ఉండడమే దరిద్రం. పైకి ధనం లేనట్టు కనబడ్డా ధర్మిష్టి అయ్యి వేద ధర్మాన్ని ఆచరించి నిత్యతృప్తుడని కొనియాడబడిన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్నవాడు దరిద్రుడు కాదు కానే కాదు పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.

ఇవి కూడా చదవండి: సనాతన ధర్మం పునర్జన్మ సిద్ధాంతం – కంచి పరమాచార్యుల బోధ · గణపతి తత్త్వం – గణపతి అంటే ఎవరు? · సుగుణ దుర్గుణ బోధ – రామాయణం ఇచ్చే సందేశం

❗ అన్నీ ఉన్నా ధర్మదూరులై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, కుల దేవతను, స్వధర్మాన్ని, వదిలి ప్రవర్తించి, అనాచారాన్ని ప్రవర్తింపచేసిన రావణాది రాక్షసులు, కంసకౌరవాదుల వలె పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా వారే అసలైన దరిద్రం అనుభవించినవారు.

❗ భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, కులదేవతారాధనం, స్వధర్మపాలనం, ఆచారసంప్రదాయాలను పాటించడం, గురుపాద సేవనం ఇవే ఐశ్వర్యం — తద్వ్యతిరిక్తమే దారిద్ర్యం.

Advertisement

🙏 స్వస్తి

సమస్త లోకాః సుఖినో భవంతు 🙏

తరచుగా అడిగే ప్రశ్నలు

దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడమేనా?

కాదు. ధర్మాన్ని, సంప్రదాయాన్ని వదిలి, ఉన్నదానితో తృప్తి లేకుండా ఉండడమే అసలైన దరిద్రం.

కుచేలుడు దరిద్రుడు కాదని ఎందుకు అంటారు?

పైకి ధనం లేనట్టు కనబడ్డా కుచేలుడు వేద ధర్మాన్ని ఆచరించి నిత్యతృప్తుడిగా కొనియాడబడ్డాడు. స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్న అతను పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.

ధనవంతులైనా దరిద్రులు ఎవరు?

అన్నీ ఉన్నా ధర్మానికి దూరమై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ఆచారాన్ని, కులదేవతను వదిలి ప్రవర్తించినవారు. రావణాది రాక్షసులు, కంసకౌరవాదులు పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా అసలైన దరిద్రం అనుభవించినవారు.

సనాతన ధర్మం ప్రకారం నిజమైన ఐశ్వర్యం ఏమిటి?

భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, కులదేవతారాధనం, స్వధర్మపాలనం, ఆచారసంప్రదాయాలను పాటించడం, గురుపాద సేవనం ఇవే నిజమైన ఐశ్వర్యం.

దారిద్ర్యాన్ని దూరం చేసుకోవడానికి ఏం పాటించాలి?

ధర్మ మార్గాన్ని అనుసరించడం, స్వధర్మాన్ని పాటించడం, కులదేవతను ఆరాధించడం, గురుసేవ చేయడం, ఉన్నదానితో తృప్తిగా ఉండడం అలవర్చుకోవాలి. వీటికి వ్యతిరేకమైనదే దారిద్ర్యం.