నిర్జల ఏకాదశి మహిమ | వ్యాస మహర్షి ఉపదేశం | భీమసేనునికి చెప్పిన వ్రత విశిష్టత
🍀 నిర్జల ఏకాదశి 🍀 ధర్మరాజు ఒకరోజు 'నిర్జల ఏకాదశి' గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు. వ్యాసుడు.
🍀 నిర్జల ఏకాదశి 🍀
ధర్మరాజు ఒకరోజు 'నిర్జల ఏకాదశి' గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు. వ్యాసుడు.. **'జేష్ఠ మాసంలోని రెండు పక్షాలలోని ఏకాదశినాడు భోజనం చేయకు, ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమ'**ని చెబుతుండగానే ఈ విషయం వినిన భీముడు 'మా తల్లి కుంతి, అన్న ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు.
కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికొకమారే ఉపవాసం చేస్తాను. నాకు ఏ వ్రతంతో స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని కోరుతాడు.
వ్యాసులవారు 'ఓ! భీమసేనా! జేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథునరాశిలోకొస్తాడు. అప్పుడు శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని (నిర్జల) తాగకుండా ఉండు. తాగావో వ్రత భంగమవుతుంది.
ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో 'ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు' అని తెలియజేశాడు.
ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశినాడు చేసిన స్నానం, దానం, జపం, హోమం, మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు అంటున్నారు.
'నిర్జల ఏకాదశి' ని విధి పూర్వకంగా చేసినవారు వైష్ణవపదమును పొందుతారు. నిర్జల ఏకాదశి నాడు అన్నం, వస్త్రం, గోవు, జలం, మంచం, కమండలం, గొడుగు దానం చేయాలి అని వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు.
🙏
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏


