రుద్రాక్షల మహిమ

  • రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తారు.
  • అవి పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి.
  • రుద్రాక్షలను ధరించడం వల్ల మనసులో కోరుకున్న పనులు నెరవేరతాయి.
  • ఎలాంటి కష్టనష్టాలు రావు, అడ్డంకులు తొలగిపోతాయి.
  • సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష.
  • ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది.
  • ఋషులు రుద్రాక్షను భూమికీ స్వర్గానికీ మధ్య వారధిగా భావించారు.
  • మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, వ్యసనాలు రుద్రాక్ష ధారణతో తొలగిపోతాయి.
  • నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేసే వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది.

Advertisement

సరస్వతీ నదితో సమానం

  • రుద్రాక్షలను సర్వపాపాలను నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు.
  • మెడ, చేతులు, చెవులకు రుద్రాక్షలను ధరించినవారు అపజయాలు లేకుండా తిరుగులేని వారిగా ప్రసిద్ధి చెందుతారు.
  • ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి.
  • ముఖాల ఆధారంగా రుద్రాక్షలు ఇరవయ్యొక్క రకాలుగా విభజించబడ్డాయి.

రుద్రాక్ష ధరించిన వారు పాటించవలసిన నియమాలు

Advertisement
  1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
  2. శ్మశానానికి వెళ్లకూడదు.
  3. కుటుంబ సభ్యులైనా, ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
  4. ఉంగరంలో రుద్రాక్ష ధరించకూడదు.
  5. ధరించి నిద్రపోకూడదు.
  6. ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
  7. స్త్రీలు రుతుసమయంలో ధరించకూడదు.

ధారణ విధి

  • సోమవారం, పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి.
  • ఆ తర్వాత మాత్రమే రుద్రాక్షను ధరించాలి.
  • వెంటనే అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూడకూడదు.
  • సత్వర ఫలితాల కోసం గురువు సమక్షంలో, సిసలైన పద్ధతిలో రుద్రాక్షను ధరించి సాధన చేయాలి.

ధరించవలసిన తిథులు

Advertisement
  • పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాసశివరాత్రి రోజుల్లో రుద్రాక్షలతో శివపూజ అత్యుత్తమం.
  • రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగి, సకల సంపదలు సిద్ధిస్తాయని స్కాంద పురాణం పేర్కొంటుంది.

రుద్రాక్షల వృక్షాలు

  • జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్‌ వంటి ప్రాంతాల్లో మరియు భారత్‌లో కొన్ని మాత్రమే ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.


ఓం నమో భగవతే రుద్రాయ
శుభమస్తు

ఇట్లు
మీ అవధానుల శ్రీనివాస శాస్త్రి

సర్వే జనాః సుఖినోభవంతు
లోకాస్సమస్తాః సుఖినోభవంతు
సమస్త లోకాః సుఖినోభవంతు