దేవీ శరన్నవరాత్రులు- దేవీ అవతారం విశిష్టత - అన్నపూర్ణాదేవి 🍀

మూడవ రోజు:- అవతారం అన్నపూర్ణ దేవి ఆశ్వయుజ శుద్ధ తదియ అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం.
మూడవ రోజు:- అవతారం అన్నపూర్ణ దేవి
ఆశ్వయుజ శుద్ధ తదియ
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ”హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అన్నపూర్ణాస్తోత్రం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧ ||
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౨ ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౩ ||
కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౪ ||
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౫ ||
ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౬ ||
ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౭ ||
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౮ ||
చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౯ ||
క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||
లోకాస్సమస్తాః సుఖినో భవంతు | ఓం శాంతిః శాంతిః శాంతిః |
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ శ్రీ శారదా మాత్రే నమః 🙏
ధన్యవాదములు🙏
ముక్తినూతలపాటి శ్రీనివాసు ( వాసు )
తరచుగా అడిగే ప్రశ్నలు
దేవీ శరన్నవరాత్రులలో అన్నపూర్ణాదేవి అలంకారం ఏ రోజు చేస్తారు?
శరన్నవరాత్రులలో మూడవ రోజు, ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.
అన్నపూర్ణాదేవి పూజ ఎలా చేయాలి, ఏ పుష్పాలు వాడాలి?
అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి తెల్లని పుష్పాలతో పూజ చేయాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చేయాలి.
నవరాత్రి మూడవ రోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యం ఏమిటి?
మూడవ రోజు అన్నపూర్ణాదేవికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చేయాలి.
అన్నపూర్ణాదేవి పూజలో జపించాల్సిన మంత్రం ఏది?
ఈ రోజున ”హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి.
అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే కలిగే ఫలితాలు ఏమిటి?
ప్రచారంలో ఉన్నట్లుగా అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
అన్నపూర్ణాదేవి మహాశివునికి భిక్ష పెట్టిన కథ ఏమిటి?
ప్రచారంలో ఉన్నట్లుగా ఆదిభిక్షువైన మహాశివునికి భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- లక్ష్మీదేవి కోసం శుక్రవార వ్రతం (శుక్రవారం ఉపవాసం): నియమాలు, సామగ్రి, పూజా విధి, మంత్రాలు మరియు 2026 శుక్రవారాలు
- ఆత్మజ్ఞానానికి అడ్డుగోడ అహంకారం | అహం తొలగితేనే నిజమైన జ్ఞానం
- అమెరికా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉపవాసం & పూజా విధానాలు
- అమెరికాలోని హిందువుల కోసం వైకుంఠ ఏకాదశి 2026 గైడ్: తేదీలు, ఉపవాసం, ఆలయాలు & పూజా విధానం
- ఏకాదశ రుద్రాభిషేకం: ప్రయోజనాలు, విధానం & ప్రాముఖ్యతకు సంపూర్ణ మార్గదర్శి




