కృష్ణాష్టమి మహిమ

  • శివరాత్రి పరమశివునికి,
  • నవరాత్రి అమ్మవారికి,
  • రామనవమి శ్రీరామచంద్రునికి,
  • స్కందషష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి అంకితం అయినట్లే,

కృష్ణాష్టమి ఒక్క కృష్ణుడి పుట్టినరోజే కాక,
అతడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పండుగ.

Advertisement

ఎందుకంటే, కృష్ణావతారం పూర్ణావతారం.
మిగిలిన అవతారములలో మహావిష్ణువు అంశరూపంలో కనపడతాడు.
రామావతారంలో కూడా –

  • రాముడు (విష్ణువు),
  • లక్ష్మణుడు (ఆదిశేషుడు),
  • భరత–శత్రుఘ్నులు (శంఖ–చక్రం)
    మానవ రూపాలలో కన్పిస్తారు.

కానీ కృష్ణుడే చిన్ననాటి నుండి “నేనే భగవంతుడిని” అని ప్రకటించాడు.
ధర్మబోధకుడిగా భగవద్గీతను అందించాడు.

Advertisement

అందుకే కృష్ణావతారమే పరిపూర్ణావతారం.


భగవద్గీతలో రహస్యం

  • అర్జున ఉవాచ
  • సంజయ ఉవాచ
  • ధృతరాష్ట్ర ఉవాచ అని వ్రాయబడింది.

కానీ కృష్ణ ఉవాచ అని రాయకుండా, భగవానువాచ అని ఉంటుంది.
దీనిబట్టి కృష్ణుడు మహావిష్ణువు యొక్క సంపూర్ణ స్వరూపం అని స్పష్టమవుతుంది.


వైష్ణవ సంప్రదాయం

  • వైష్ణవులు ఈ పండుగను లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.
  • మధురలోని కారాగృహంలో జన్మించిన కృష్ణుడు,
  • గోకులంలో నందుని ఇంట పెరిగి,
  • సోమనాథ క్షేత్ర సమీపంలోని ప్రతాప్ ఘర్‌లో ముక్తి పొందాడు.

తన బాల్యంలో:

  • పూతన, శకటాసురాదులను సంహరించాడు.
  • యశోదకు తన నోట పదునాలుగు లోకాలను చూపించాడు.
  • బ్రహ్ముడు పరీక్షించినపుడు, గోపాల బాలు తానే అన్నీ అవతరించి గోకులాన్ని కాపాడాడు.


కురుక్షేత్రలో విశ్వరూపం

కృష్ణుడు అనేక సందర్భాలలో విశ్వరూపం చూపినప్పటికీ,
అర్జునునకు కురుక్షేత్రంలో చూపిన విశ్వరూపమే శాశ్వతమైనది.
అదే భగవద్గీత రూపంలో జగత్తుకు అందించిన దివ్యజ్ఞానం.


నిత్య స్మరణ మంత్రాలు

ఓం నమో నారాయణాయ  
ఓం నమో భగవతే వాసుదేవాయ  
ఓం నమో గోపీజన వల్లభాయ


కృష్ణాష్టమి పూజా విధానం

లేవవలసిన సమయం

  • ఉదయం 5 గంటలకు

శుభ్రపరచవలసినవి

  • పూజామందిరం
  • ఇల్లు

అలంకారములు

  • గడపకు పసుపు–కుంకుమ
  • గుమ్మానికి తోరణాలు
  • పూజామందిరంలో ముగ్గులు

స్నానం

  • తలస్నానం

వస్త్రధారణ

  • పసుపు రంగు పటుబట్టలు

పూజా సిద్ధి

  • పటములకు గంధం, కుంకుమ అలంకరించాలి
  • కలశానికి పసుపు వస్త్రం కప్పాలి
  • పూజకు శ్రీకృష్ణుడు రాధతో కూడిన చిత్రం/ప్రతిమ


పూజలో వాడవలసిన వస్తువులు

  • అక్షతలు: పసుపు కలిపినవి
  • పువ్వులు: కదంబ పుష్పాలు
  • మాలలు: సన్నజాజి పూలమాలతో అలంకారం
  • నైవేద్యం: పానకం
  • పిండివంటలు: వడపప్పు
  • నిషేధం: కమల పండ్లు


పారాయణ చేయవలసినవి

  • అష్టోత్తరం: శ్రీకృష్ణ అష్టోత్తరం
  • స్తోత్రాలు: శ్రీకృష్ణాష్టకం, బాలకృష్ణ స్తోత్రం
  • సహస్రనామం: శ్రీకృష్ణ సహస్రనామం
  • గ్రంథం: శ్రీమద్భాగవతం (దశమ, ఏకాదశ స్కంధాలు)


దేవాలయ దర్శనం

  • సమీప శ్రీకృష్ణ దేవాలయం
  • గౌడీయమఠాలు

ప్రత్యేక పూజలు

  • కృష్ణ అష్టోత్తర పూజ
  • కృష్ణ సహస్రనామపూజ

ఉత్సవములు

  • శ్రీకృష్ణ లీలల నాటికలు
  • శ్రీకృష్ణ చరిత్ర ఉపన్యాసాలు


దీపారాధన

  • దీపం: కంచు దీపం
  • దీపాల సంఖ్య: 2
  • వత్తులు: 5 (దూదితో)
  • నూనె: కొబ్బరి నూనె
  • హారతి: ఆవు నేతితో పంచహారతి


జపం

  • మంత్రం: ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
  • సంఖ్య: 108 సార్లు
  • జపమాల: తులసి మాల
  • ధారణ: తులసి మాలతో మెడలో శ్రీకృష్ణ ప్రతిమ


అభిషేకం

  • పంచామృతములతో

దిశ

  • తూర్పుదిక్కు తిరిగి పూజ


జయ శ్రీకృష్ణా