దృష్టి – దృశ్యం – జ్ఞాపకం – వినికిడి మహత్తు

ఎదురుగా ఉన్నవాటిని కంటితో ఎన్నో చూస్తాము. చూసినదాన్ని దృశ్యం అంటాము. తరువాత మళ్లీ ఆ దృశ్యం జ్ఞాపకంలోకి వస్తుంది. ఆ జ్ఞాపకం తెచ్చుకోవటమే మనకు ఆ దృశ్యం గుర్తుకు రావడానికి కారణం.
మిగిలిన సమయాల్లో అది మనసు లో ఒక మూలలో ఉండిపోయి ఉంటుంది. పూర్వం కళ్లతో చూచిన దృశ్యం మళ్లీ జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు అది కళ్లకు కాదు — మననుకు అవబడుతుంది! ఎంత చిత్రమైన అమరిక ఇది! దృశ్యం దృష్టిలోనే ఇమిడి ఉందన్న మాట!
చూసేది కన్ను. కనిపించేది దృశ్యం. చూసిన దాన్ని గుర్తు చేసుకోవడం దృష్టి. దృక్, దృశ్యం, దృష్టి అనే విభజన తెలిసినప్పుడు ఆలోచన కలుగుతుంది. మిగతా ఇంద్రియాలు కూడా ఈ విధంగా విభిన్నంగా పనిచేస్తాయి.
కథలు వింటాం. వాటిని జ్ఞాపకంలోకి తెచ్చుకుంటాం. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కొత్త విషయాలను వినే కుతూహలం వల్లనే కథలు వినాలనిపిస్తుంది. కేవలం విషయాలను వంద చెబితే వాటిని గుర్తు పెట్టుకోగలంా? సాధారణంగా కుదరదు. వాటిలో ఒకదానికీ మరొక దానికి ఉన్న సంబంధం చెప్పినప్పుడు, ధర్మాన్ని వివరించినప్పుడు, తేలికగా జ్ఞాపకం ఉంచుకోగలం. ఆ సంబంధంలోని సామరస్యమే కథ! అందుకే పిల్లలకీ పెద్దలకీ కథలంటే ఇష్టం!
వినడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కేవలం చెవులతో విని మర్చిపోవడం. మరొకటి మనసుతో, బుద్ధితో, శరీరంతో విని గ్రహించడం, పాటించడం. ఈ రెండో విధానంలో వినమ్రతతో, ఆసక్తితో వినాలి.
చివరికి ఎంత శ్రద్ధతో వినారో, అంచేత అంత ఉపయోగం కలుగుతుంది.