శ్రీ కార్తిక పౌర్ణమి నాడు ఏమి చేయాలి?

ఈ రోజు ఏం చేయాలి? ప్రతి గృహస్థుడూ ఇంట్లో కార్తీక దీపం వెలిగించాలి!
ఈ రోజు ఏం చేయాలి? ప్రతి గృహస్థుడూ ఇంట్లో కార్తీక దీపం వెలిగించాలి! ఒక్క రోజు కూడా దీపం ఆరిపోకూడదు – ఇది మన సనాతన నియమం. ఒకవేళ ప్రయాణం, ఆఫీసు, ఆరోగ్యం వల్ల కుదరకపోతే… పాప పరిహారం కోసం ఈ పౌర్ణమిన ౭౨౦ వత్తుల గుత్తి దీపం పెట్టండి!
🔥 ౭౨౦ వత్తుల గుత్తి దీపం
- ఒక ఏడాది ౩౬౦ రోజులు × ౨ (సాయంత్రం + ఉదయం) = ౭౨౦
- ఆవునేతిలో ముందుగా తడిపి సిద్ధం చేయండి
- దంపతులిద్దరూ కలిసి వెలిగించండి
- తులసికోట వద్ద పెట్టండి
⏰ ఎప్పుడు వెలిగించాలి?
- ఇంట్లో → పౌర్ణమి తిథి ప్రధానం
- ఆలయంలో → కృత్తికా నక్షత్రం ప్రధానం
- వీలైతే ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి మూడు రోజులూ పెట్టండి
🌿 తులసీ ప్రదక్షిణం పాట (పిల్లలతో కలిసి పాడుతూ ౧౧ ప్రదక్షిణలు చేయండి)
౧. గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా ౨. ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా! వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా ౩. రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! నిండైన సందలు నాకియ్యవమ్మా ౪. మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! ముత్తైదువతనం నాకియ్యవమ్మా ౫. నాల్గో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! నవధాన్య రాసులు నాకియ్యవమ్మా ౬. అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! ఆయువై దోతనం నాకియ్యవమ్మా ౭. ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా ౮. ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! వెన్నుని ఏకాంత సేవ నాకియ్యవమ్మా ౯. ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! యమునిచే బాధలు తప్పించవమ్మా ౧౦. తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా ౧౧. పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా
🎤 ఎవరు పాడినా → ఏకాశి మరణం 🎤 పుణ్యస్త్రీలు పాడితే → పుత్రసంతానం
రామతులసీ… లక్ష్మీ తులసీ… నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా!
🌟 శుభాకాంక్షలు 🌟 శ్రీ సద్గురు పీఠం
🙏 ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి – మీ భక్తి ఇతరులకు కూడా చేరాలి! 🙏




