మ౦థరుడు – పురాణ మహిమ

కార్తీకమాస మహిమను వశిష్ఠ మహర్షి వివరించుచూ రాజు జనకునితో ఇలా అనిరి —

Advertisement

ఈ పవిత్ర కార్తీకమాసపు వ్రత మహిమను ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఈ నెలలో విష్ణువునికి అవిసెపూలతో పూజ చేస్తే చంద్రాయణ వ్రతఫలము లభిస్తుంది.
విష్ణుని ఆరాధన అనంతరం పురాణ పఠనం, వినడం, వినిపించడం వలన భక్తులకు తప్పక వైకుంఠప్రాప్తి.

ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం వినుము.

Advertisement


మ౦థరుని కథ

పూర్వం కళింగదేశమున మ౦థరుడు అనే బ్రాహ్మణుడు ఉండెను.
అతడు ఇతరుల ఇళ్లలో వంటవాడు; అక్కడే భుజించు. మద్యం, మాంసం సేవించి,
నీతినిష్ఠలు, స్నానం, జపం, దీపారాధన లాంటివి చేయకుండా దురాచారిగా జీవించెను.

అతని భార్య మాత్రం పతివ్రత, శాంతస్వభావము, సదాచారిణి.
భర్త తప్పులు తెలిసినా, దేవుడిచ్చిన పతి భావంతో సేవ చేసుచు, హరి నామస్మరణతో బ్రతికెను.

Advertisement

కాలక్రమంలో మ౦థరుడు చిన్న వ్యాపారం చేసి సంపాదన లేక, చివరికి దొంగమారెను.
ప్రజలను భయపెట్టి ధనం దోచి జీవించుచుండెను.

ఒక రోజు ఒక బ్రాహ్మణునిపై దాడి చేసి దోచుచుండగా ఒక కిరాతకుడు వచ్చి ఆ బ్రాహ్మణుడు, మ౦థరుడు ఇద్దర్నీ చంపి ధనం తీసికొనెను.
అతనిపై వస్తున్న పులిని చంపగా, పులి తన పంజాతో కిరాతకుడిని కూడా చంపెను.

ఈ విధంగా నలుగురు పరస్పరం హత్య పాపంతో మరణించి యమలోకానికి చేరి శిక్షలు అనుభవించుచుండిరి.

Advertisement


భార్య భక్తి

మ౦థరుడు మరణించిన పిమ్మట అతని భార్య హరి భక్తితో కాలం గడుపుచుండెను.
ఒక రోజు ఆశ్రమఋషి ఆమె ఇంటికి వచ్చెను. ఆమె వినయసేవలను చూసి మోక్షమార్గం ఉపదేశించెను.

ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఋషి చెప్పగా ఆమె ఆలయ శుభ్రత చేసి, వత్తులు తయారు చేసి, నూనె నింపి దీపారాధన చేసెను.
రాత్రంతా ఆలయంలో పురాణ శ్రవణం చేసింది.

Advertisement

అప్పటి నుండి భక్తితో బ్రతికి, కాలమై విష్ణుదూతలొచ్చి విమానములో వైకుంఠానికి తీసికొనిపోయిరి.


భర్త ఉద్ధారణ

మార్గమధ్యంలో యమలోకమున ఆమె మ౦థరుడుని యాతనపడుచుండుట చూచి,
విష్ణుదూతలను వేడుకొని భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా రక్షించమని కోరెను.

దూతలు —
కార్తీక పౌర్ణమిలో నీవు చేసిన దీపవత్తి పుణ్యం వ్యాఘ్రునికి,
దీపదానం ఫలం కిరాతునికి,
పురాణ శ్రవణ పుణ్యం బ్రాహ్మణునికి ధారపోస్తే — అందరికీ మోక్షము అనిరి.

Advertisement

అలా ఆమె సమస్త పుణ్యాన్ని పంచగా, ఆ నలుగురు విమానములో వైకుంఠప్రాప్తి పొందిరి.


ఫలసారం

కావున, ఓ రాజా!
కార్తీకమాసమున దీపదానం, పురాణ శ్రవణం చేసినవారికి
అపార పుణ్యం, మోక్షఫలం సిద్ధిస్తాయి.


పదకొండవ రోజు పారాయణము సమాప్తము
🕉 AVB సుబ్బారావు గారి ధర్మప్రచారం 🕉