బంగారాన్ని Ban చేస్తే బావుండును.
బంగారం ఎవరేనా వీధిలోకి పెట్టుకుని వస్తే arrest చెయ్యాలి.
Only బంగారం కొనుక్కుని lockerలో పెట్టుకోవడం లేదా Gold లోను పెట్టుకుందుకు మాత్రమే అనుమతించాలి.

దీనమ్మ జీవితం.. తక్కువ ధర ఉన్నంతకాలం అదే ఎక్కువ ధర అని కొనుక్కోకపోవడం…
ధర పెరిగిన తరువాత పాత ధరలను తలుచుకుని కొనలేక పోయామే అని ఏడవడం.
తరతరాలుగా ఏడిపించడమే దీని కర్తవ్యం.

ఇదే బంగారం చేసిన, చేస్తున్న, చేసే దుర్మార్గం.

పెట్టుకున్నంతసేపు ఆనందపెట్టడం, పెట్టెలో పెట్టేడపుడు భయపెట్టడం.
మనకుంటే గర్వపెట్టడం,
పక్కవాడికుంటే ఈర్షపెట్టడం ఇదే దీని పని.

అతిగా మెరవడం, వేసుకుంటే ఆనందపెట్టడం, పోతే బాధ పెట్టడం ఇదే దీని పని.

తనే మెరవడం, వేరేదేదైనా మెరిస్తే… మెరిసేదంతా బంగారం కాదనడం, ఇదే దీనిపని.
ఇది పెరిగితే పోయె…
దీనితో పాటు దీని చెల్లిని కూడ తనలో పాటు పైకి తీసుకెళ్ళడం ఇదే దీని పని..

వెండి కొని బంగారం అని మరిపిద్దామన్నా కూడ లేకుండా చేసింది.

దిగిరాకపోయావో ఇక నీకు స్వస్తి. 👋

ఇంక మాకు వేరే గత్యంతరం ఏమిలేదు గిల్టు నగా (వన్ గ్రామ్ గోల్డా) శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
🙏

ఇట్లు
నీ
బంగారం కాదు
🙏😊

తరచుగా అడిగే ప్రశ్నలు

బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఎందుకు కొనరు?

ధర తక్కువగా ఉన్నంతకాలం అదే ఎక్కువ ధర అనుకుని కొనకుండా ఆగిపోతారు. ధర పెరిగిన తరువాత పాత ధరలను తలుచుకుని కొనలేకపోయామే అని బాధపడతారు.

బంగారం మనిషిలో ఎలాంటి భావోద్వేగాలు కలిగిస్తుంది?

పెట్టుకున్నంతసేపు ఆనందం, పెట్టెలో దాచేటప్పుడు భయం కలిగిస్తుంది. మన దగ్గర ఉంటే గర్వం, పక్కవాడి దగ్గర ఉంటే ఈర్ష్య, పోతే బాధ కలిగిస్తుంది.

బంగారం ధర పెరిగితే వెండి ధరపై ప్రభావం ఉంటుందా?

బంగారం పెరిగితే తన చెల్లి అయిన వెండిని కూడా తనతో పాటు పైకి తీసుకెళ్తుందని రచయిత వ్యంగ్యంగా చెప్పారు. వెండి కొని బంగారం అని సరిపెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు.

బంగారం కొనలేని సామాన్యుడికి మిగిలిన దారి ఏమిటి?

ధరలు దిగిరాకపోతే గిల్టు నగలు లేదా వన్ గ్రామ్ గోల్డ్ నగలే శరణం అని రచయిత హాస్యంగా ముగించారు.

బంగారాన్ని బ్యాన్ చేయాలని రచయిత ఎందుకు అంటారు?

బంగారం తరతరాలుగా ప్రజలను ఏడిపిస్తోందని వ్యంగ్యంగా చెబుతూ, దానిని కేవలం లాకర్‌లో పెట్టుకోవడానికి లేదా గోల్డ్ లోన్ కోసమే అనుమతించాలని సరదాగా సూచించారు. ఇది హాస్య రచన మాత్రమే, ఆర్థిక సలహా కాదు.