భర్తృహరి గారి సుభాషితము నుండి ఒక గొప్ప నీతి కథ:

వనజ భవుండు కోపమున వాహన మైన మరాళ భర్తకున్
వన జననీ విహార కలనంబు దొలగంగ జేయు గాని గుం
భనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూడ నైపుణీ
జనిత మహా యశో విభవ సారము హంసకు మాన్ప జాలునే


తా𝕝𝕝 బ్రహ్మకు తన వాహన మైన హంస పైన కోపము వచ్చిన పద్మ సరోవరము లందు విహరిమప కుండు నటుల ఆజ్ఞాపించ గలడుకానీ నీరు క్షీర ములను వేరు చేయగల నేర్పును తీసి వేయలేడు గదా!…..

అటులనే అధికారికి కోపము వచ్చిన వారిని… ఉద్యోగము నుండి తొలగించ గలడు కానీ వారి విద్యనూ, ప్రతిభను వారి నుండి లాక్కో లేడు కదా! వారు యింకొక చోట ఉద్యోగము సంపాదించుకో గలరు. విద్య , ప్రతిభ ముఖ్యమని కవి యొక్క భావము

తరచుగా అడిగే ప్రశ్నలు

వనజ భవుండు కోపమున పద్యం ఎవరిది?

"వనజ భవుండు కోపమున" అనే నీతి పద్యం భర్తృహరి సుభాషితముల నుండి తీసుకోబడింది. ఇది విద్య, ప్రతిభ విలువను తెలియజేస్తుంది.

భర్తృహరి సుభాషితంలో హంస ఉదాహరణ ఏమిటి?

బ్రహ్మ కోపంతో తన వాహనమైన హంసను కమలవనాలలో విహరించకుండా చేయగలడు. కానీ పాలు నీళ్లు వేరు చేసే హంస నైపుణ్యాన్ని, దాని వల్ల వచ్చిన కీర్తిని మాన్పలేడు.

ఈ సుభాషితాన్ని ఉద్యోగ జీవితానికి ఎలా అన్వయించవచ్చు?

అధికారికి కోపం వస్తే ఉద్యోగం నుండి తొలగించగలడు కానీ వారి విద్యను, ప్రతిభను లాక్కోలేడు. వారు మరో చోట ఉద్యోగం సంపాదించుకోగలరు.

భర్తృహరి సుభాషితం నేర్పే నీతి ఏమిటి?

పదవి, స్థానం పోయినా మనిషి సంపాదించిన విద్య, ప్రతిభ ఎవరూ తీసివేయలేనివి. కాబట్టి విద్య, ప్రతిభ ముఖ్యమని కవి భావం.