(ఓ సరదా నవ్వుల కథ)

ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు. అతను ఆంగ్ల పదాలను మక్కికి మక్కి అనువాదం చేసి మాట్లాడుతుంటాడు...

📱 చరవాణి ఎక్కడ?

ఉమాపతి సెల్ మోగుతోంది. అతను దాన్ని వెతుకుతూ, "నా చరవాణి ఎక్కడ? చరవాణీ ఎక్కడున్నా వే?" అని గట్టిగా అరుస్తుంటే, కిచెన్‌లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా,
👉 "చరవాణా? అదెవత్తీ?" అంటూ గరిటాతో సహా వచ్చింది.

"అదేనే కనకం! నా సెల్ ఫోన్!"

కనకం తలబాదుకుంటూ, "మీ చొక్కా జేబులో వుంది!" అనిచెప్పి వెళ్లిపోయింది.

📞 బావా, ఉపనయనం ఉంది!

ఉమాపతి సెల్ ఎత్తి, "ఎవరూ?" అన్నాడు.

📢 "నేను బావా! రమాపతిని. మా అబ్బాయి గణపతికి ఈ నెల 10న ఉపనయనం. తప్పకుండా రావాలి!"

"సరే వస్తాం బావా!"

🚆 ప్రయాణం

"కనకం! 'దరిద్రరథం' (గరీబ్ రథ్)లో రెండు 'శయనాలు' (బెర్త్స్) బుక్ చేయమని సంతోషకర ప్రయాణాల వాడికి (ట్రావెల్ ఏజెంట్) చెప్తాను."

కనకం నెత్తి కొట్టుకుంటూ, "పుస్తకం చెయ్యడమేమిటి? బుక్ చెయ్యమని చెప్పండి!"

🚕 స్టేషన్‌లో ఆటపాట

హైదరాబాద్ చేరాక, ఉమాపతి, "బావా! చతుశ్చక్ర వాహనం (కారు) పంపించలేదే?"

బావమరిది తెల్లబోయి, "సారీ బావా, మా అబ్బాయి కారుతో బయటకు వెళ్లాడు."

ఉమాపతి, "సరే, ఈ త్రిశ్చక్ర వాహనం (ఆటో)లో వెడదాం!"

👓 తిక్కతిక్కగా ఉన్న ఉపనయనాలు

ఉమాపతి మండపంలోకి వెళ్ళి భార్య కనకం కోసం చూస్తూ, "కనకం ఎక్కడుందీ?" అనుకున్నాడు.

కనకాంబరం రంగు చీర కనిపించడంతో "ఇదిగో కనకం!" అనుకుని కొంగు పట్టుకొని లాగాడు.

ఒక్కసారిగా ఆవిడ గట్టిగా అరచి, "ఏమిటీ తిక్కతిక్కగా వుంది?"

Advertisement

ఉమాపతి అటు ఇటు చూసి, "నా ఉపనయనాలు (కళ్లజోడు) కనపడడం లేదు!"

😂 నవ్వుల ఉపనయనం

కనకం తలబాదుకుని, "నిన్నరాత్రి రైల్లో నాబాగులో పెట్టారు కదా!" అని తీసి అతని కళ్లకు పెట్టింది.

మొత్తానికి అంతా సర్దుకుని ఊరికి బయలుదేరారు.

🚆 వెళ్తుండగా, ఉమాపతి "బావా! ఈసారి వస్తే 'ఉప-ఉపనయనాలు' దగ్గరుంచుకో!" (అంటే స్పేర్ కళ్లజోడు) అంటూ నవ్వేశాడు.


💡 మీకు కొత్త తెలుగు పదాలు తెలుసాయా?
😊 నవ్వుల ఉప-ఉపనయనాలు!

తరచుగా అడిగే ప్రశ్నలు

ఉపనయనం కథలో ఉమాపతి ఎవరు?

ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు. అతను ఆంగ్ల పదాలను మక్కికి మక్కి తెలుగులోకి అనువదించి మాట్లాడుతుంటాడు, అదే కథలోని హాస్యానికి మూలం.

కథలో 'ఉపనయనాలు' అంటే అర్థం ఏమిటి?

ఉమాపతి కళ్లజోడును 'ఉపనయనాలు' అని పిలుస్తాడు. స్పేర్ కళ్లజోడును 'ఉప-ఉపనయనాలు' అంటూ నవ్వించాడు.

ఉమాపతి సెల్ ఫోన్‌ను ఏమని పిలిచాడు?

ఉమాపతి సెల్ ఫోన్‌ను 'చరవాణి' అని పిలిచాడు. అది అర్థం కాని భార్య కనకం "చరవాణా? అదెవత్తీ?" అంటూ గరిటాతో సహా వచ్చింది.

కథలో కారు, ఆటోలకు ఉమాపతి వాడిన పదాలు ఏమిటి?

కారును 'చతుశ్చక్ర వాహనం' అని, ఆటోను 'త్రిశ్చక్ర వాహనం' అని, గరీబ్ రథ్ రైలును 'దరిద్రరథం' అని, బెర్త్స్‌ను 'శయనాలు' అని ఉమాపతి పిలిచాడు.

ఉమాపతి ఎవరి ఉపనయనానికి వెళ్లాడు?

బావ రమాపతి కొడుకు గణపతికి ఈ నెల 10న ఉపనయనం ఉందని ఫోన్ రావడంతో ఉమాపతి, కనకం హైదరాబాద్ వెళ్లారు.