🚩 నేటి మాట 🚩

🚩 గంగావతరణ విన్నవారికి ఫలశ్రుతి 🚩

తెలిసికానీ, తెలియకకానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి.


🌿 పాప విమోచనం మరియు సుఖప్రాప్తి

  • వారు ఇంతకుపూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు.


Advertisement

🌿 దీర్ఘాయుష్షు మరియు అపమృత్యు దోష నివారణ

  • వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు.
  • చిరంజీవులు అవుతారు.
  • అపమృత్యుదోషం ఉండదు.


🌿 కీర్తి మరియు సత్కర్మానుష్టానం

  • చక్కటి కీర్తి పొందుతారు.

అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్టానం కలిగి వేరోకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు.


🌺 గంగావతరణ మహిమ 🌺

కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమయినది.

🚩🙏 గంగాధరుని కృపతో సర్వేజనాః సుఖినో భవంతు 🙏🚩

Advertisement