కుంభమేళా
Kumbh Mela Pooja Vidhanam, Katha & Significance in Telugu
కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా పేరుపొందింది. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాశిక్ అనే నాలుగు పవిత్ర నదీ క్షేత్రాల్లో వంతులవారీగా ఇది జరుగుతుంది. క్షీరసాగర మథనం తర్వాత అమృత కలశం నుంచి కొన్ని చుక్కలు ఈ ప్రదేశాల్లో పడ్డాయని పురాణ కథనం. కాలచక్రాన్ని బట్టి దీనిని కుంభ్, అర్ధ కుంభ్, మహా కుంభ్ అని, ఉజ్జయినిలో సింహస్థ అని పిలుస్తారు. మన దక్షిణాదిలో జరిగే పుష్కరాలకు కూడా ఇదే తరహా ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
మేళా సమయంలో పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నాగా సాధువుల నుంచి వివిధ అఖాడాల మహాత్ముల వరకు ఎందరో సన్యాసులను దర్శించుకునే, సత్సంగాల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఇది.
ఈ పేజీలో కుంభమేళా కాలచక్రం వివరణ, షాహీ స్నాన ఊరేగింపుల అర్థం, ప్రధాన అఖాడాల పరిచయం, త్రివేణీ సంగమం, ఇతర ఘాట్‌ల గైడ్‌లు, కుటుంబాలతో వెళ్లేవారికి ప్రయాణం, రద్దీ, బస గురించి ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలు, గంగామాత గురించిన వ్యాసాలు కూడా చదవండి. వృద్ధులు, చిన్నపిల్లలతో కలిసి మేళాకు వెళ్లే కుటుంబాలు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలను కూడా ఇక్కడ వివరించాం.
తాజా వ్యాసాలు

"మహా కుంభమేళాలో తొక్కిసలాటలు: కారణాలు, నివారణ మరియు భక్తుల భద్రత"

తీర్థయాత్రల పోలిక: కుంభమేళా, చార్ ధామ్, హజ్, బోధ్ గయ, శిఖర్జీ మరియు మరిన్ని

కుంభమేళా 2025: ముగింపు తేది, పవిత్ర స్నాన అవకాసాలు, మరియు ముఖ్యమైన శాహి స్నాన్ తేదీలు

మహా కుంభ మేళా: అద్భుతమైన రికార్డులు

మహా కుంభ మేళా 2025: ఉప ముఖ్యమంత్రి శ్రీ #పవన్ కళ్యాణ్ పవిత్ర స్నానం & ఆర్తి

మహాకుంభ - 2025 ప్రయాగరాజ్

మహా శివరాత్రి మరియు మహా కుంభమేళా: భక్తి, ఆచారాలు, జ్యోతిషశాస్త్ర పరమైన పవిత్ర సమ్మేళనం

మహా కుంభమేళా: హిందూ కుటుంబాలకు ప్రాముఖ్యత మరియు 2025 కుంభమేళాకు సిద్ధత

ప్రతి హిందువు మహా కుంభమేళాను ఎందుకు సందర్శించాలి

మీరు కుంభమేళాకు వెళుతుంటే ఈ చిట్కాలు మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు

నాగ సాధువులు: హిందూ మతంలోని యోధ సన్యాసుల జీవితం, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక సేవ

శీర్షిక: కుంభమేళాలో సాధువుగా మారువేషంలో ఉన్న మిలిటెంట్ అరెస్ట్

నాగ సన్యాసులు ఎవరు? నాగ సాధువుల రహస్యాన్ని ఆవిష్కరిస్తోంది

త్రివేణి సంగమం: హిందువులకు ఆధ్యాత్మికత యొక్క పవిత్ర సంగమం

బృహస్పతి యొక్క 144-సంవత్సరాల చక్రం: భారతదేశం యొక్క కాస్మిక్ జ్ఞానం మరియు మహా కుంభమేళాకు దాని లోతైన సంబంధం

ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

మహా కుంభమేళా యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: ఒక పవిత్రమైన కలయిక

జ్యోతిష్య సంబంధం: కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఎందుకు జరుగుతుంది

సాధువులు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు: మహా కుంభమేళా యొక్క ఆధ్యాత్మిక వ్యక్తులు

కుంభమేళాలో పవిత్ర నదులలో స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యత
తరచుగా అడిగే ప్రశ్నలు
కుంభమేళా అంటే ఏమిటి?
కుంభమేళా హిందువుల అతి పెద్ద తీర్థయాత్ర సమ్మేళనాల్లో ఒకటి. సాధువులు, అఖాడాలు, లక్షలాది భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతం చుక్కలు నాలుగు చోట్ల పడ్డాయని పురాణ కథ.
కుంభమేళా ఎక్కడ జరుగుతుంది?
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం, హరిద్వార్‌లో గంగా తీరం, ఉజ్జయినిలో క్షిప్రా నది, నాసిక్-త్రయంబకేశ్వర్‌లో గోదావరి తీరం అనే నాలుగు క్షేత్రాల్లో వంతులవారీగా జరుగుతుంది. గోదావరి పుట్టిన చోటే నాసిక్ కుంభమేళా జరుగుతుంది.
తర్వాతి కుంభమేళా ఎప్పుడు?
గురు, సూర్య, చంద్రుల స్థానాల ఆధారంగా ఒక్కో క్షేత్రంలో కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. ప్రధాన స్నానాల రోజులను అధికారులు ముందుగానే ప్రకటిస్తారు. ప్రయాణం ప్లాన్ చేసే ముందు అధికారిక ప్రకటనలు, మా పంచాంగం చూడండి.
