కర్నూల్ జిల్లా మహానంది ఆలయంలో భక్తులపై జరుగుతున్న అన్యాయం – మీకు తెలిసినదా?

మహానంది ఆలయం – పవిత్రతకు ప్రతీక. కానీ ఈ పుణ్యక్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న వాస్తవాలు మనసును కలచివేస్తున్నాయి. ఆలయ పాలనలో జరుగుతున్న కొన్ని మోసాలు, అవ్యవస్థలపై RR టీం సమర్పిస్తున్న పరిశీలన ఇది:
1) అన్నదానం – నామమాత్రమే!
నిత్య అన్నదానం చేయాలని ఎన్నోమంది డోనర్లు ముందుకొస్తున్నారు. రోజూ వేలాది భక్తులు దర్శనానికి వస్తుంటారు. కానీ అన్నదానం కేవలం 100 మందికే, అదీ కొంత మందికే ఎందుకంటే…
👉 ఆలయం ప్రారంభంలో ఓ హోటల్ నిర్వహణకు అప్పగించారు.
👉 ఆ హోటల్ నిర్వాహకుడు సంవత్సరానికి ₹40 లక్షలు చెల్లిస్తున్నాడు.
👉 దేవాలయంలో అన్నదానం జరిగితే అతనికి నష్టం… కాబట్టి అన్నదానాన్ని నియంత్రిస్తున్నారు.
2) శౌచాలయాల పరిస్థితి దారుణం
🙏 దేవాలయ ప్రాంగణంలో బాత్రూములు ఉన్నా మూసేసారు.
👉 “పే యూజ్” బాత్రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
👉 మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు 10 రూపాయలు చెల్లించకపోతే ఉపయోగించలేరు.
👉 డబ్బులు లేకపోతే బయట చెట్లకు వెళ్ళాల్సిన పరిస్థితి.
3) దేవస్థానం గదులు – పేరుకు మాత్రమే
👉 రోజుకు ₹200 అని చెప్పినా, “ఫుల్” అన్న సమాధానమే వస్తుంది.
👉 గదులు పాడై, మంచాలు చిరిగిపోయి, దుర్గంధంగా ఉంటాయి.
👉 చుట్టుపక్కల లాడ్జీలు సంవత్సరానికి ₹3 కోట్లు చెల్లిస్తూ భక్తుల్ని ప్రైవేట్ రూములకు బలవతం చేస్తారు.
4) పూజాసామాగ్రి షాపులు – ఒక్కటే!
👉 దేవాలయాల చుట్టూ పూజా సామాగ్రి షాపులు అనివార్యం.
👉 కానీ మహానంది ఆలయంలో ఒక్క షాప్ మాత్రమే ఉంది.
👉 రేట్లపై నియంత్రణ లేదు – భక్తులు అతి ధరలకు కొనాల్సిందే.
5) నవగ్రహాల పేరుతో వ్యాపారం!
👉 శివుడు, కామేశ్వరి, ఆంజనేయులు దర్శించాక మాత్రమే నవగ్రహాల ఆలయం ఉంటుంది.
👉 బయటకు వెళ్లే మార్గాన్ని మూసేసి, లోపలికి ప్రదక్షిణ చేయమంటారు.
👉 ఒక పంతులు భక్తులనుంచి ₹50 వసూలు చేస్తూ దీపాలేర్పాటు పేరు మీద డబ్బులు దోచేస్తాడు.
👉 నవగ్రహాల ఆలయ నిర్వహణను ఏడాదికి ₹20 లక్షలకు అప్పగించారని సమాచారం.
6) ఫోటోలు తీసేందుకు కూడా మోసం?
👉 గర్భగుడిలో ఫోటోలు తీసే విషయం వదిలేద్దాం.
👉 ఆలయ ఆవరణలో ఫోన్ ఫోటోలు తీసేందుకు అనుమతి లేదు!
👉 ఎందుకంటే… ఫోటోగ్రాఫర్లకు కాంట్రాక్టులు ఇచ్చి, డబ్బులిచ్చి మాత్రమే ఫోటోలు తీసేలా చేస్తున్నారు.
7) భద్రాచలం, కాణిపాకం లాంటి ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి
👉 అనేక దేవాలయాల్లో కనీస సౌకర్యాలు లేవు.
👉 ధర్మాన్ని వ్యాపారంగా మార్చుతున్నారు.
👉 భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికైనా స్పందించాలి!
🙏 మీరు కూడా ఈ అన్యాయంపై స్పందించాలి.
👉 ఈ పోస్ట్‌ను షేర్ చేయండి.
👉 అధికారులకు ఇది తెలుసు చేసే బాధ్యత మనదే.
👉 లేకపోతే భవిష్యత్తులో సామాన్య భక్తులకు దేవాలయాల దర్శనం ఒక కలగా మిగిలిపోతుంది!
✊ ధర్మ రక్షణే మన ధర్మం
– RR టీం