ప్రతి నిత్యం మనం చేసే పని — చేతులు జోడించి భగవంతునికి నమస్కరించడం.
కానీ అసలు “నమస్కారం” అంటే ఏమిటి?
దాని లోని ఆధ్యాత్మిక అంతరార్థం మనకు చాలా మందికి తెలియదు, తెలిసినా లోతుగా గ్రహించము.


Advertisement

నమస్కారం అంటే కేవలం రెండు చేతులు జోడించడం కాదు.
అది మన అహంకారాన్ని అర్పించడం, మన శరీరం, మనస్సు, కర్మ, జ్ఞానం అన్నీ భగవంతునికి సమర్పించడమే.

మనకు ఉన్న

Advertisement

  • ఐదు కర్మేంద్రియాలు (చేతులు, కాళ్లు, వాక్కు, ప్రాణవాయువు, ప్రోజనన శక్తి)
  • ఐదు జ్ఞానేంద్రియాలు (చూచుట, వినుట, వాసన, రుచి, స్పర్శ)

ఇవి అన్నీ కలిపి భగవంతునికి అర్పించటం — అదే నిజమైన నమస్కారం.


‘నమః’ పదార్థం

Advertisement

‘నమః’ అనగా ‘న మ’, అంటే “నాదికాదు” అని అర్థం.
అంటే — “ఇది నాది కాదు, సర్వమూ నీవే భగవంతుడా!” అని చెప్పే నిరహంకార భావం.

ఈ విధంగా అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని చిత్తానికి లీనమవడం — అదే నమస్కార సారాంశం.


కర్మ ముందు నమస్కారం

Advertisement

కర్మలను ప్రారంభించే ముందు మనం కర్మ దేవతకు నమస్కరించాలి.
వేదములో ఇలా ఉంది —
“తస్మై నమః కర్మణే”
అంటే —

“ఓ కర్మ దేవతా!
నాచే పవిత్రమైన, ధర్మమయమైన కర్మలనే చేయించు.”


తాత్పర్యం

నమస్కారం అంటే భౌతికంగా రెండు చేతులు కలపడం కాదు.
మన అంతరంగంలో భగవంతునికి సమర్పణ భావం, కృతజ్ఞత భావం, అహంకార రహిత దృష్టి కలిగించడం.

Advertisement

భగవంతుని స్మరించి

“ఓ ప్రభూ! నేను చేయబోయే కార్యములు నీ చిత్తానుసారం సఫలమవ్వునుగాక!”

అని మనస్పూర్తిగా ప్రార్థించడమే నమస్కారపు నిజమైన అర్థం.


శుభమస్తు ॥
🙏 శ్రీ సద్గురు పీఠం
సమస్త లోకా సుఖినో భవంతు ॥