మేషం

ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో నూతన సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి–వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.

Advertisement


వృషభం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి–వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమించి సకాలంలో పూర్తిచేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు, శుభకార్య ఆహ్వానాలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

Advertisement

మిథునం

దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి తగ్గుతుంది. ఇంటా–బయట గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.


కర్కాటకం

Advertisement

వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా–బయట కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.


సింహం

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చూపడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగించవచ్చు. ఉద్యోగంలో అధికారుల విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.


కన్యా

Advertisement

నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మిత్రులతో దూరప్రయాణ అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి చోటుచేసుకుంటుంది.


తుల

ఉద్యోగంలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతం అవుతాయి. వృత్తి–వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.


వృశ్చికం

Advertisement

వృత్తి–వ్యాపారాలలో ఊహించని స్థానచలనం అవకాశాలున్నాయి. ఇంటా–బయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గంతో మాటపట్టింపులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయకండి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధించవచ్చు.


ధనస్సు

వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేయడం మంచిది కాదు. వృత్తి–వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


మకరం

వృత్తి–వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావనలు వస్తాయి. గృహనిర్మాణ పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరుల అవసరాలకు కూడా ధనసహాయం చేస్తారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.


కుంభం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొన్ని విషయాలలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. వ్యాపార–ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.


మీనం

ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడకండి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.


శుభం భూయాత్