12-09-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు

♈ మేషం ధన వ్యవహారాలు కలసి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
♈ మేషం
ధన వ్యవహారాలు కలసి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.
వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
♉ వృషభం
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.
ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.
అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
నూతన వ్యాపారాలు విస్తరిస్తారు.
నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.
ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
♊ మిధునం
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. పనులు మందకోడిగా సాగుతాయి.
తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు.
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు.
ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.
♋ కర్కాటకం
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
సమాజ ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.
దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.
వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
♌ సింహం
నూతన వాహన యోగం కలుగుతుంది.
ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
అవరోధాలు అధిగమించి పనులు ముందుకు సాగుతాయి.
బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటారు.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
♍ కన్య
పాత ఋణాలు తీర్చడానికి కొత్త ఋణ ప్రయత్నాలు చేస్తారు.
కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ఖర్చుకు తగిన ఆదాయం ఉండదు.
వృధా ఖర్చులు పెరుగుతాయి.
వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి.
ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పదు.
♎ తుల
ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి.
ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి.
సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.
స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
ఉద్యోగ వివాదాలు పరిష్కారమవుతాయి.
♏ వృశ్చికం
ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కాని పూర్తికావు.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
అవసరానికి ధనం నిల్వ ఉండదు.
నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
కుటుంబంలో మాటపట్టింపులు కలుగుతాయి.
ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.
ఉద్యోగాలలో శ్రమ తప్పదు.
♐ ధనస్సు
నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.
ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
గృహ కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి.
ఆర్ధిక పురోగతి సాధిస్తారు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
సమాజంలో గౌరవం పెరుగుతుంది.
♑ మకరం
ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు ప్రశంసలు అందుతాయి.
గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు ఉంటాయి.
వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి.
♒ కుంభం
మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచన ఉంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలకు కొత్త సమస్యలు వస్తాయి.
ఉద్యోగాలలో నిరుత్సాహం ఉంటుంది.
♓ మీనం
ఇతరులకు మాట ఇవ్వడంలో జాగ్రత్త వహించాలి.
పనులలో శ్రమ పెరుగుతుంది.
ధనపరమైన ఇబ్బందులు తప్పవు.
ఆరోగ్యం సహకరించక చికాకులు కలుగుతాయి.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.
ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.
🌼 శుభం భూయాత్ 🌼




