15-10-2025 బుధవారం రాశి ఫలితాలు

✦ వాసు ముక్తినూతలపాటి ✦📞 AVB Subbarao — 9985255805 ♈ మేషం వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి.
✦ వాసు ముక్తినూతలపాటి ✦
📞 AVB Subbarao — 9985255805
♈ మేషం
వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి.
ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి.
మాతృ సంబంధిత అనారోగ్యాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.
ఉద్యోగములో శ్రమాధిక్యత పెరుగుతుంది.
♉ వృషభం
స్థిరాస్తి కొనుగోలు యోగం ఉన్నది.
సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి.
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.
మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు.
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.
♊ మిధునం
వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
సన్నిహితులతో మాటపట్టింపులు జరుగుతాయి.
చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదురవుతాయి.
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
♋ కర్కాటకం
నూతన వాహన యోగం ఉన్నది.
ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
♌ సింహం
నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు.
చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.
వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి.
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.
దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
♍ కన్యా
ఆకస్మిక ధనలాభ యోగం ఉన్నది.
వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.
♎ తులా
వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
యాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
♏ వృశ్చికం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి.
ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు.
నూతన వాహన యోగం ఉన్నది.
వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
♐ ధనుస్సు
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
వ్యాపార, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు.
♑ మకరం
వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి.
ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
గృహములో శుభకార్యాలు నిర్వహిస్తారు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
♒ కుంభం
వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.
ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.
పాత రుణాలు తీర్చగలుగుతారు.
బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
♓ మీనం
బంధువులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి.
సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.




