♈ మేషం

ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
దూరప్రయాణ సూచనలు ఉన్నాయి.
దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

Advertisement

♉ వృషభం

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.
ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.


Advertisement

♊ మిధునం

దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం.
వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగవచ్చు.
వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
ఆదాయ మార్గాలు సానుకూలంగా ఉంటాయి.


♋ కర్కాటకం

రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది.
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
శత్రు పరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు.
సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Advertisement


♌ సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు.
దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు.
చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడుల విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.


♍ కన్య

వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు.
ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
వ్యాపార విస్తరణ నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

Advertisement


♎ తుల

కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.
కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.
జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలగవచ్చు.
వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.


♏ వృశ్చికం

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
వృధా ఖర్చులపై పునరాలోచన చేయాలి.
నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలించవు.
నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

Advertisement


♐ ధనస్సు

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.
నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి.
వ్యాపారాలలో విశేష లాభాలు పొందుతారు.


♑ మకరం

ఉద్యోగంలో అధికారులతో సమస్యలు శిరోభారంగా మారతాయి.
ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.
రుణ ఒత్తిడి వలన కొత్త రుణాలు చేయవలసి వస్తుంది.
దూరప్రయాణాలు వాయిదా పడతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.


♒ కుంభం

ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు వస్తాయి.
మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
ఉద్యోగంలో స్థానచలనాలు జరుగుతాయి.
కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.


♓ మీనం

ఉద్యోగంలో పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి అవుతాయి.
నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
వ్యాపారాలలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు.
ఉద్యోగంలో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.