మేషం

ఆకస్మిక ప్రయాణాలు జరగవచ్చు. నూతన రుణాలు తీసుకోవచ్చు. కొన్ని వ్యవహారాల్లో ఎంత కష్టించినా ఫలితం తక్కువగా ఉండవచ్చు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Advertisement


వృషభం

నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది.

Advertisement

మిధునం

చేపట్టిన పనుల్లో సులభ విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఉంటుంది. ధన పరంగా అనుకూలత పెరుగుతుంది.


కర్కాటకం

Advertisement

చేపట్టిన వ్యవహారాలు మందగమనంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సగటుగా ఉంటుంది. పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు తీసుకోవచ్చు. దూరప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి.


సింహం

రుణదాతల ఒత్తిళ్లు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు తారసపడతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.


కన్య

Advertisement

ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో అంచనాలు సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది.


తుల

సోదరుల నుండి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు, విక్రయాలు లాభదాయకంగా సాగుతాయి. వృత్తి/ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి దారిలో ఉంటాయి.


వృశ్చికం

Advertisement

కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశ కలగవచ్చు.


ధనుస్సు

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగాలు సగటుగా ఉంటాయి.


మకరం

సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉంటాయి. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతల నుండి ఉపశమనం ఉంటుంది.


కుంభం

వ్యయప్రయాసలతో పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగాల్లో స్వల్ప వివాదాలు తప్పవు.


మీనం

నూతన వ్యవహారాలు కార్యరూపం పొందతాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగతాయి.


శుభం భూయాత్ 🌿