మేషం (Aries)

ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి.

Advertisement

వృషభం (Taurus)

దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుండి బయటపడటానికి కొత్త రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి.


Advertisement

మిథునం (Gemini)

దైవకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.


కర్కాటకం (Cancer)

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుండి ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

Advertisement


సింహం (Leo)

సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానానికి కొత్త విద్యావకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.


కన్య (Virgo)

ముఖ్యమైన పనుల్లో కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపార విస్తరణ వాయిదా వేయబడుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.

Advertisement


తుల (Libra)

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పనుల్లో ప్రతిష్ఠంభనలు ఎదురవుతాయి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన స్థానం దక్కదు.


వృశ్చికం (Scorpio)

ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత లభిస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో పనిచేస్తారు.

Advertisement


ధనస్సు (Sagittarius)

గృహ పరిస్థితులు మానసిక చికాకు కలిగిస్తాయి. దైవకార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపారం, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం ఉండదు.


మకరం (Capricorn)

ఆప్తుల సలహాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు.


కుంభం (Aquarius)

ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా–బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి.


మీనం (Pisces)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.


🌸 శుభం భూయాత్ 🌸