24 జూన్ 2025 (మంగళవారం) | దినఫలితాలు - జ్యోతిష్య మార్గదర్శనం

ముక్తినూతలపాటి వాసు గారి రాశి ఫలితాలుమేషం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు.
ముక్తినూతలపాటి వాసు గారి రాశి ఫలితాలు
మేషం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం
కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.
మిధునం
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.
కర్కాటకం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.
సింహం
సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి.
కన్య
జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
తుల
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం
సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.
ధనస్సు
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
మకరం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
కుంభం
వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.
మీనం
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.
🍁 శుభం భూయాత్
తరచుగా అడిగే ప్రశ్నలు
24 జూన్ 2025 మేష రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి?
మేష రాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, సంతానం నుండి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
24 జూన్ 2025 ఏ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి?
వృషభం, మకరం రాశుల వారు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.
24 జూన్ 2025 ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
మిధునం వారు ప్రయాణాలు వాయిదా వేసి ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. కన్య, తుల, ధనస్సు, కుంభం రాశుల వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా లేదా ఆశించినట్లు సాగవు.
24 జూన్ 2025 ఉద్యోగస్థులకు ఏ రాశుల్లో అనుకూలత ఉంది?
వృషభం వారికి ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి, వృశ్చికం వారికి పదోన్నతులు, మకరం వారికి ఉత్సాహకర వాతావరణం, మీనం వారికి ఉద్యోగమున అనుకూలత సూచించబడ్డాయి.
24 జూన్ 2025 మీన రాశి ఫలితాలు ఏమిటి?
మీన రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి, వస్త్రాభరణాల కొనుగోలు సూచించబడ్డాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు, గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.
24 జూన్ 2025 రాశి ఫలితాలు ఎవరు అందించారు?
ఈ దినఫలితాలను జ్యోతిష్యులు ముక్తినూతలపాటి వాసు గారు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులకు అందించారు. ఇవి సూచనలు మాత్రమే, హామీలు కావు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు


