రోజువారీ రాశిఫలం 28 మే 2026 (గురువారం) — అన్ని 12 రాశుల ఫలితాలు
28 మే 2026, గురువారం నాటి అన్ని 12 రాశుల రోజువారీ రాశిఫలాలు — మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం రాశుల ఫలితాలు.

28 మే 2026, గురువారం నాటి ద్వాదశ రాశుల రోజువారీ రాశిఫలాలు. మీ రాశిని బట్టి ఈరోజు వృత్తి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి.
మేషం
వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
వృషభం
ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన ఋణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.
మిధునం
ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
కర్కాటకం
ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.
సింహం
బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు.
కన్య
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక ఋణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
తుల
అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.
వృశ్చికం
కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు
ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.
మకరం
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరో బాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యల పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.
కుంభం
చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.
మీనం
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
సర్వేజనాః సుఖినో భవంతు · సమస్త సన్మంగళాని భవంతు
గమనిక: ఇవి సాధారణ జ్యోతిష అంచనాలు; వ్యక్తిగత నిర్ణయాలకు మీ జాతకాన్ని పంచాంగంతో సరిచూసుకోండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
28 మే 2026న ఏ రాశులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది?
కన్య రాశికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుందని, ధనస్సు రాశికి ఆర్థిక పురోగతి కలుగుతుందని ఫలితం చెప్పబడింది. ఈ రెండు రాశులకు వ్యాపారాల్లో లాభాల సూచనలు కూడా ఉన్నాయి.
28 మే 2026న వృషభ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
వృషభ రాశికి ఆర్థిక ఇబ్బందులు, నూతన ఋణయత్నాలు, దూర ప్రయాణాల్లో అవాంతరాలు సూచించబడ్డాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదని సలహా ఇవ్వబడింది.
28 మే 2026న మిధున రాశి వారు దూర ప్రయాణం చేయవచ్చా?
మిధున రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిదని సూచించబడింది. మిత్రులతో కలహ సూచనలు, పని ఒత్తిడి వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవని కూడా చెప్పబడింది.
28 మే 2026న ఏ రాశులకు ఆలయ దర్శన యోగం ఉంది?
తుల, వృశ్చికం, మకరం రాశుల వారికి ఆలయ దర్శనాలు సూచించబడ్డాయి. వృశ్చిక రాశి వారు మిత్రులతో, మకర రాశి వారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారని ఫలితం.
28 మే 2026న నిరుద్యోగులకు రాశిఫలం ఎలా ఉంది?
ధనస్సు రాశిలో నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయని, మీన రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయని సూచన ఉంది. సింహ రాశి నిరుద్యోగుల శ్రమ ఫలించదని చెప్పబడింది.
రోజువారీ రాశిఫలం ఆధారంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవచ్చా?
ఇవి సాధారణ జ్యోతిష అంచనాలు మాత్రమే, ఎలాంటి హామీ కాదు. వ్యక్తిగత నిర్ణయాలకు మీ జాతకాన్ని పంచాంగంతో సరిచూసుకోవడం మంచిది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు




