3-10-2025 / సోమవారం / రాశి ఫలితాలు శుభం భూయాత్: సర్వం శుభమగుగాక!

మేషం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.
మేషం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
వృషభం
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
మిధునం
వ్యాపారపరంగా ఉన్న ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన, గృహ యోగములు ఉన్నవి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.
కర్కాటకం
నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారమున లాభాలు కలుగుతాయి.
సింహం
దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
కన్య
సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహ సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
తుల
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం
చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
ధనస్సు
దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.
మకరం
వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.
కుంభం
భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనం
చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి.
శుభం భూయాత్ సర్వం శుభమగుగాక!
తరచుగా అడిగే ప్రశ్నలు
3-10-2025 సోమవారం నిరుద్యోగులకు ఏ రాశుల్లో అవకాశాలు ఉన్నాయి?
మేషం వారికి నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. మిధునం వారి ప్రయత్నాలు కలసివస్తాయి. కర్కాటకం వారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయని సూచన, మకరం వారికి యత్నాలు కలిసిరావు.
3-10-2025న ఏ రాశుల వారికి వాహన, గృహ యోగం ఉంది?
మిధునం వారికి నూతన వాహన, గృహ యోగాలు ఉన్నాయి. తుల వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారని సూచన. మీనం వారు గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు.
3-10-2025 సోమవారం ఏ రాశుల వారు ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలి?
వృషభం వారికి అవసరానికి మించి ఖర్చులు, సింహం వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కన్య వారికి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
3-10-2025న వ్యాపారులకు ఏ రాశుల్లో లాభాలు సూచించబడ్డాయి?
కర్కాటకం వారికి వ్యాపారమున లాభాలు, కుంభం వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మకరం వారు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు పొందే అవకాశం ఉంది.
3-10-2025 సోమవారం ఏ రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి?
ధనస్సు వారు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి. మీనం వారికి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు




