మేషం

మాతృ ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. రావలసిన ధనంలో ఆలస్యం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు ఎదురవుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అనుకూలంగా ఉండవు.

Advertisement


వృషభం

చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నా పూర్తి చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యపై శ్రద్ధ పెట్టడం మంచిది. ధన వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వృత్తి–వ్యాపారాలలో సోదరుల సహకారం లభిస్తుంది.

Advertisement

మిథునం

వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఇంటి విషయాలు మానసిక అస్వస్థతకు దారితీస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.


కర్కాటకం

Advertisement

దూరప్రయాణాలు లాభదాయకం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో అనుగ్రహం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.


సింహం

ఉద్యోగంలో అధిక ఒత్తిడి. ఖర్చులు ఆదాయాన్ని మించి పెరుగుతాయి. వ్యాపారాలు సాధారణ స్థాయిలోనే సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు. ఆరోగ్యపరంగా వైద్య సలహా తీసుకోవాల్సి వస్తుంది.


కన్యా

Advertisement

కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. సంతాన వివాహ ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి.


తులా

నిరుద్యోగులకు కొంత కష్టం తర్వాత అవకాశాలు వస్తాయి. వృత్తి–ఉద్యోగాల్లో ఓర్పు అవసరం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కార్యరూపం దాలుస్తుంది. ఇతరులపై మీ అభిప్రాయాలు మార్చుకోవడం మంచిది.


వృశ్చికం

కుటుంబ సభ్యుల్లో అవగాహన లోపంతో వివాదాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో చర్చలు జరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి–వ్యాపారాలలో స్వల్ప లాభాలు.


ధనసు

ఉద్యోగంలో సహోద్యోగులతో వివాదాలు దూరం పెట్టాలి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉండొచ్చు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.


మకరం

భూ క్రయ–విక్రయాల్లో నిరుత్సాహకర ఫలితాలు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సోదరులతో ఒక విషయంలో విభేదాలు. ఉద్యోగాలలో విమర్శలు తప్పవు. వృధా ఖర్చులు అదుపులో పెట్టాలి. పనులు సకాలంలో పూర్తికావు.


కుంభం

సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతతో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగం పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇతరుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.


మీనం

భూ సంబంధిత విషయాల్లో తగాదాలు బాధిస్తాయి. సంతానంతో మాటపట్టింపులు. వృత్తి–ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలు. దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సాధారణంగా సాగుతాయి. వ్యాపార భాగస్వాముల ఒత్తిడి పెరుగుతుంది.


🍁 శుభం భూయాత్