🐏 మేషం

ఆప్తుల నుండి అవసరమైన ధన సహకారం లభిస్తుంది. పాత రుణాల నుండి విముక్తి పొందుతారు. సంతాన విద్యపై దృష్టి సారించాలి. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు వస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Advertisement

🐂 వృషభం

ఆస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో లాభాలు పొందుతారు. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.


Advertisement

👫 మిధునం

ఋణ ఒత్తిడి మానసిక బాధలకు దారితీస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. దైవసేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. సంతాన విద్యలో ఊహించని పరిణామాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టపడి పూర్తవుతాయి. ఉద్యోగాలలో గందరగోళం ఉంటుంది.


🦀 కర్కాటకం

మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో చిన్న వివాదాలు ఉంటాయి. ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Advertisement


🦁 సింహం

ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో సఖ్యతగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామితో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


👧 కన్య

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధువుల నుండి ప్రత్యేక ఆహ్వానాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు.

Advertisement


⚖️ తుల

స్వంత నిర్ణయాలు అనుకున్నట్లు ఫలించవు. కుటుంబంలో చిన్న విభేదాలు కలుగుతాయి. పనులలో జాప్యం ఉంటుంది. ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


🦂 వృశ్చికం

కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. కొత్త వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు వస్తాయి.

Advertisement


🏹 ధనుస్సు

కీలక నిర్ణయాలు ధైర్యంగా తీసుకుని లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు వస్తాయి. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల సహాయం లభిస్తుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.


🐊 మకరం

చేయని పనికి విమర్శలు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ఉద్యోగ ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర, ఆహారం లోపిస్తాయి. నేత్ర సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాటపట్టింపులు కలుగుతాయి.


🏺 కుంభం

సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సంతాన విద్య అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.


🐟 మీనం

ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగాలలో స్థానచలనం సూచన ఉంది. ఖర్చులు పెరుగుతాయి. ఇంటి, బయట ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.