మేషం

ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.


వృషభం

చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు. ఇంటా–బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


మిధునం

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయం–వ్యయం సమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త అవసరం.


కర్కాటకం

కుటుంబ విషయాలలో స్వయంగా ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరించుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది.


సింహం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.


కన్యా

ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రుణాలను తీర్చగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యసాధన జరుగుతుంది.


తులా

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు తలెత్తుతాయి. కొత్త రుణ యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి.


వృశ్చికం

కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనాలు చేస్తారు. నూతన వాహనయోగం కలదు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.


ధనుస్సు

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి విలువైన బహుమతులు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.


మకరం

కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూసంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి.


కుంభం

ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్యం బాధిస్తుంది. చేపట్టిన పనులకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన విశ్రాంతి కరువవుతుంది.


మీనం

దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.


🌸 శుభం భూయాత్ 🌸

తరచుగా అడిగే ప్రశ్నలు

18-08-2025 సోమవారం మేష రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి?

మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు, స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు సూచించబడ్డాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని ఫలితాలు చెబుతున్నాయి.

18-08-2025 న ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు సూచించబడ్డాయి?

మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశులకు అనుకూల సూచనలు ఉన్నాయి. వృశ్చికం వారికి మొండి బకాయిలు వసూలవడం, ధనుస్సు వారికి సమాజంలో పలుకుబడి పెరగడం సూచించబడ్డాయి.

18-08-2025 న ఆరోగ్య విషయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?

వృషభం వారికి వైద్య సంప్రదింపులు అవసరం కావచ్చని, సింహం వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరమని సూచించబడింది. కుంభం వారికి స్వల్ప అనారోగ్యం బాధించవచ్చని ఫలితాలు చెబుతున్నాయి.

18-08-2025 సోమవారం కన్యా రాశి ఫలితాలు ఏమిటి?

కన్యా రాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగి రుణాలను తీర్చగలిగే సూచనలు ఉన్నాయి. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయని, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయని సూచించబడింది.

18-08-2025 న ప్రయాణాల విషయంలో ఏ రాశులకు జాగ్రత్త అవసరం?

తులా వారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని, సింహం వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయని సూచించబడింది. మిధునం వారికి అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు.

18-08-2025 న ఉద్యోగాల పరంగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి?

తులా వారికి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు, కుంభం వారికి అదనపు పనిభారం సూచించబడ్డాయి. మీనం వారు అధికారుల అనుగ్రహం పొందుతారని, కర్కాటకం వారికి ఉద్యోగ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుందని ఫలితాలు చెబుతున్నాయి. ఇవి సాధారణ సూచనలు మాత్రమే.