23 జూన్ 2025 (సోమవారం) | దినఫలితాలు - జ్యోతిష్య మార్గదర్శనం

ముక్తినూతలపాటి వాసు గారి రాశి ఫలితాలుమేషం ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది.
ముక్తినూతలపాటి వాసు గారి రాశి ఫలితాలు
మేషం
ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.
వృషభం
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
మిధునం
స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం
దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది.
కన్య
దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.
తుల
ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదర స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృశ్చికం
వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
ధనస్సు
నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి.
మకరం
ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.
కుంభం
రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.
మీనం
ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతనప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.
🍁 శుభం భూయాత్
తరచుగా అడిగే ప్రశ్నలు
23 జూన్ 2025న మేష రాశి వారికి దినఫలితం ఎలా ఉంది?
మేష రాశి వారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుందని సూచన. కుటుంబ పెద్దల ఆరోగ్యం కోసం వైద్య సంప్రదింపులు, దూరప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి.
23 జూన్ 2025న ఏ రాశుల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయని సూచన?
కర్కాటకం, కుంభం రాశుల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయని, ధనస్సు రాశి వారికి వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయని దినఫలితాలు సూచించాయి.
దూర ప్రయాణాలు వాయిదా వేయాలని ఏ రాశులకు సూచించారు?
వృషభ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని, మకర రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయని సూచన ఉంది. మీన రాశి వారు ప్రయాణాలలో తొందరపడకూడదు.
ఉద్యోగ పరంగా ఏ రాశులకు అనుకూలంగా ఉంది?
ధనస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు, మిధున రాశి వారికి అనుకూలత పెరుగుతుందని సూచన. కర్కాటక రాశి వారు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారని ఫలితం చెబుతోంది.
మకర రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
మకర రాశి వారికి ధన పరంగా ఒడిదుడుకులు, దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి సూచించబడింది. నూతన ఋణాలు చేయకపోవడం మంచిదని, అధికారులతో సమస్యలు రావచ్చని ఫలితం చెబుతోంది.
తుల రాశి వారికి 23 జూన్ 2025 ఎలా ఉంది?
తుల రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిదని సూచన. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు, సోదరులతో స్వల్ప వివాదాలు ఉండవచ్చు; వృత్తి ఉద్యోగాలలో అప్రమత్తంగా ఉండాలి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు




