10-11-2025 సోమవారం రాశి ఫలితాలు

♈ మేషం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
♈ మేషం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటి–బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
♉ వృషభం
నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందు–వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు యోగం ఉంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు కలుగుతాయి.
♊ మిథునం
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
♋ కర్కాటకం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
♌ సింహం
వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
♍ కన్యా
కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ–వాహన యోగం ఉంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
♎ తులా
వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ–విక్రయాలలో లాభాలు పొందుతారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశ ఆహ్వానాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
♏ వృశ్చికం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
♐ ధనుస్సు
వృత్తి, వ్యాపారాలలో స్థాన చలన సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆలయ సందర్శనం చేస్తారు.
♑ మకరం
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి యోగం ఉంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
♒ కుంభం
వ్యాపార, ఉద్యోగ సమస్యలు తొలగుతాయి. పూర్తికాని పనులు పూర్తి అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు–వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సంతాన విద్య–ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
♓ మీనం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
🕉️ ధర్మ ప్రచారం — AVB ధర్మ ప్రచారం 🕉️
తరచుగా అడిగే ప్రశ్నలు
10-11-2025 సోమవారం ఏ రాశుల వారికి నూతన వాహన యోగం సూచించబడింది?
వృషభం, కర్కాటకం రాశుల వారికి నూతన వాహన యోగం సూచించబడింది. కన్యా రాశి వారికి నూతన గృహ–వాహన యోగం ఉందని పేర్కొనబడింది.
10-11-2025 సోమవారం మకర రాశి వారికి ఉద్యోగంలో ఎలా ఉంటుంది?
మకర రాశి వారికి ఉద్యోగాలలో పదోన్నతి యోగం ఉందని, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని సూచించబడింది. విద్యార్థుల కష్టం ఫలిస్తుందని, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయని కూడా చెప్పబడింది.
ఆ రోజు ఏ రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి?
మేషం, సింహం, ధనుస్సు, మీనం రాశుల వారికి ఆరోగ్య సమస్యలు బాధించవచ్చని సూచించబడింది. ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే.
10-11-2025 సోమవారం మిథున రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉంటుంది?
మిథున రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయని సూచించబడింది. పనులు నత్తనడకన సాగుతాయని, కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తప్పవని పేర్కొనబడింది.
ఆ రోజు ఏ రాశుల వారికి ఆధ్యాత్మిక, దైవదర్శన సూచనలు ఉన్నాయి?
మేషం, మిథునం రాశుల వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని, కన్యా రాశి వారు కుటుంబంతో దైవదర్శనాలు చేసుకుంటారని సూచించబడింది. ధనుస్సు వారు ఆలయ సందర్శనం, మీనం వారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారని, వృశ్చికం వారు ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటారని చెప్పబడింది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు




