ఏకలవ్యుడు తక్కువ కులం వాడు కాబట్టే అగ్రకులం వాడైన ద్రోణాచార్యుడు అతణ్ని తొక్కేశాడు

ఇదే కదా... NTR సినిమాలు చూసినా, కమ్యూనిస్ట్/అంబేడ్కరిస్ట్ కబుర్లు విన్నా, చర్చ్ ప్రాపగాండా లో అయినా... మనకు కనిపించేది ఏమిటి? మనం కూడా ఒక దశలో ఆలోచించడం మానేసి, కనీసం పుస్తకం తీసి ఆ ఘట్టం చదవకుండా, ద్రవిడ వాదం ముసుగులో తమిళ-తెలుగు సినిమాల మ
ఇదే కదా... NTR సినిమాలు చూసినా, కమ్యూనిస్ట్/అంబేడ్కరిస్ట్ కబుర్లు విన్నా, చర్చ్ ప్రాపగాండా లో అయినా... మనకు కనిపించేది ఏమిటి?
మనం కూడా ఒక దశలో ఆలోచించడం మానేసి, కనీసం పుస్తకం తీసి ఆ ఘట్టం చదవకుండా, ద్రవిడ వాదం ముసుగులో తమిళ-తెలుగు సినిమాల మాధ్యమంగా కమ్యూనిజం/చర్చ్ చేసిన ప్రచారాన్ని నమ్మడం మొదలు పెట్టాం. అసలు విషయం ఏమిటో చూద్దాం.
1. మహాభారతంలోని ఏ పర్వంలో ఈ ఘట్టం వస్తుంది?
జవాబు: ఎవరికీ తెలియదు. "వన పర్వం".
2. అప్పట్లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండిందా?
జవాబు: భరద్వాజుని కొడుకు, పరశురాముని శిష్యుడు అయినా, కొడుక్కు పాలు కొనుక్కోలేని దుస్థితి ద్రోణుడిది. బావిలో పడిన రాజకుమారుల బంతిని పైకి తెచ్చిన అతని అస్త్ర విద్యా కౌశలం చూసి ఉద్యోగం ఇస్తారు, తప్ప బ్రాహ్మణుడని కాదు.
(= Meritocracy / మెరిటోక్రసీ)
3. ఏకలవ్యుడు బలహీన వర్గానికి చెందిన వాడా?
జవాబు: ద్రోణుడు ఏకలవ్యుడిని తన పరిచయం అడిగినప్పుడు, ఏకలవ్యుడు ఏమంటాడో గుర్తు తెచ్చుకోండి:
"మగధ నరేశుడు జరాసంధుని ముఖ్య సైన్యాధిపతి హిరణ్య ధనువు కుమారుడను నేను. ఏకలవ్యుడను." అంటాడు.
Note: నిషాదుడైన (ట్రైబల్) హిరణ్య ధనువు జరాసంధుని సైన్యంలో ముఖ్య సైన్యాధిపతి. మళ్లీ Meritocracy / మెరిటోక్రసీ.
"కులం తక్కువ" అని బయట కూర్చోబెట్టలేదు.
4. ఇంతకీ వేలు ఎందుకు కోసి ఇమ్మన్నారు?
జవాబు:
A) "బాణాలతో కుక్క నోరు కుట్టినందుకు" అని తెలుగు సినిమా సిచ్యుయేషన్ చెప్తుంది. ఆ వర్షన్ నిజం అనుకుంటే,
"ఒక నోరు లేని కుక్క పై అన్ని బాణాలు (శస్త్రాలు) విడిగలిగిన క్రూరుని చేతికి అస్త్రాలు/దివ్యాస్త్రాలు (weapons of mass destruction) రాకుండా ఆపడానికి" అనే జవాబు కళ్ల ముందు కనిపిస్తుంది.
B) కుక్క నోటి నిండా బాణాలు నింపుతాడు ఏకలవ్యుడు. ఆ బాణాలు తీస్తూ అర్జునుడు ఆశ్చర్యపోతాడు - "ఇన్ని బాణాలు నిండినా, కుక్క నోటిలో ఒక్క గాటు లేదు. ఇది శస్త్ర ప్రయోగం స్థాయిని మించినది (అస్త్ర ప్రయోగమే)" అని
(precision/strategic weapons).
ప్రజా సంక్షేమం, పాలన, యుక్తాయుక్త విచక్షణ, తర్కం, మీమాంస నేర్వక ముందే ఈ పరిజ్ఞానం ఇవ్వకూడదు అన్న కారణంతో రాజకుమారులకే ఇంకా అందించని "దివ్యాస్త్ర పరిజ్ఞానం" ఎలాంటి విచక్షణ లేని, తనపై ఎలాంటి పర్యవేక్షణ లేని ఒక ఫ్రీ లైఫ్ పాటించే పిల్లవాడి చేతికి వస్తే జరగబోయే పరిణామాలు ఊహించి, ఏకలవ్యుడి వేలు అడుగుతాడు ద్రోణుడు.
ప్రాణం అడిగినా, మాట అడిగినా ఇచ్చేవాడే ఏకలవ్యుడు. కానీ అడగడు ద్రోణుడు.
(సంపూర్ణ ఆరోగ్యవంతులు కాని వారికి, విలువిద్యలో ("శస్త్ర" విద్యలో) ఎక్సలెన్స్ సాధించని వారికి "అస్త్ర" పరిజ్ఞానం ఇచ్చేవారు కాదు ఏ గురువూ.)
ఏకలవ్యుడిని దివ్యాస్త్ర పరిజ్ఞానానికి దూరం చేయడమే ఉద్దేశం. క్రూరులు, కుల దురహంకారులు అయితే ఆ బ్రాహ్మలు, క్షత్రియులు కలిసి ఏకలవ్యుడిని అక్కడే నరికి చంపినా అడిగే నాథుడు ఎవడు?
5. తరువాత ఏకలవ్యుడు ఏమయి పోయాడు?
జవాబు: తన తండ్రి లాగానే మగధ దేశాధీశుడు జరాసంధుని సైన్యంలో చేరి సేనానాయకుడు అవుతాడు ఏకలవ్యుడు.
(మళ్లీ Meritocracy / మెరిటోక్రసీ)
జరాసంధుడి తరఫున కృష్ణుడి పైకి దండెత్తి వెళ్లి ఒక యుద్ధంలో కృష్ణుడి చేతిలో చనిపోతాడు.
6. ద్రోణుడి ప్లేస్లో ద్రోణుడు కరెక్ట్ ఏ అయినా, ఓ పిల్లవాడికి అంత శిక్ష వేయడం ద్రోణుడి స్థాయికి తగదు అనిపించిందా?
జవాబు: మహాభారత సారమే కర్మ సిద్ధాంతం. కర్మకు ఫలం లేకుండా ఎలా పోతుంది?
"ద్రోణుడిని చంపే యోధుడు కొడుకుగా కావాలి" అనే లక్ష్యంతో యాగం చేసిన ద్రుపదుని ఇంట ధృష్టద్యుమ్నుడిగా జన్మిస్తాడు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుడిని వధించి కర్మ ఫలం పూర్తి చేస్తాడు.
- SR హిందూ




