వనజ భవుండు కోపమున వాహన మైన మరాళ భర్తకున్
వన జననీ విహార కలనంబు దొలగంగ జేయు గాని గుం
భనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూడ నైపుణీ
జనిత మహా యశో విభవ సారము హంసకు మాన్ప జాలునే

తా𝕝𝕝 బ్రహ్మకు తన వాహన మైన హంస పైన కోపము వచ్చిన పద్మ సరోవరము లందు విహరిమప కుండు నటుల ఆజ్ఞాపించ గలడుకానీ నీరు క్షీర ములను వేరు చేయగల నేర్పును తీసి వేయలేడు గదా!…..

అటులనే అధికారికి కోపము వచ్చిన వారిని… ఉద్యోగము నుండి తొలగించ గలడు కానీ వారి విద్యనూ, ప్రతిభను వారి నుండి లాక్కో లేడు కదా! వారు యింకొక చోట ఉద్యోగము సంపాదించుకో గలరు. విద్య , ప్రతిభ ముఖ్యమని కవి యొక్క భావము

తరచుగా అడిగే ప్రశ్నలు

వనజ భవుండు కోపమున పద్యం భావం ఏమిటి?

బ్రహ్మ కోపించి తన వాహనమైన హంసను పద్మవనంలో విహరించకుండా చేయగలడు గాని, పాలు నీళ్లు వేరుచేసే దాని నైపుణ్యం వల్ల వచ్చిన కీర్తిని మాన్పలేడు. విద్య, ప్రతిభ ముఖ్యమని కవి భావము.

ఈ సుభాషితంలో హంస దేనికి ప్రతీక?

హంస విద్య, ప్రతిభ ఉన్న వ్యక్తికి ప్రతీక. పాలు నీళ్లను వేరుచేసే దాని నైపుణ్యం లాగే, ఒకరి విద్య వారి నుండి ఎవరూ తీసివేయలేని సంపద.

అధికారి కోపానికి ఈ పద్యం ఎలా వర్తిస్తుంది?

అధికారికి కోపం వస్తే ఉద్యోగం నుండి తొలగించగలడు కానీ వారి విద్యను, ప్రతిభను లాక్కోలేడు. వారు ఇంకొక చోట ఉద్యోగం సంపాదించుకోగలరు.

భర్తృహరి సుభాషితము నుండి నేర్చుకోవలసిన పాఠం ఏమిటి?

పదవి, ఉద్యోగం పోవచ్చు కానీ సంపాదించుకున్న విద్య, ప్రతిభ ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అందుకే విద్య, ప్రతిభ అత్యంత ముఖ్యమని కవి చెబుతాడు.