బాజీ ప్రభు దేశ్పాండే - ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!

భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు, పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి, ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్దారకుడు, కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలి పోకుండా ప్రజలను ప్రేమించి "ఛత్రపతి" గా ఎదిగిన జిజియా బాయి ముద్దు బిడ్డ…!
భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు, పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి, ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్దారకుడు, కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలి పోకుండా ప్రజలను ప్రేమించి "ఛత్రపతి" గా ఎదిగిన జిజియా బాయి ముద్దు బిడ్డ…!!
నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. అతడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ 💪🚩🚩
కానీ ఈ వ్యాసం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కాదు. ఆయన ప్రాణాలను కాపాడిన ఒక యోధుడి గురించి.
మన చరిత్ర మనం తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత…!!
1660 – శివాజీని చుట్టుముట్టిన శత్రువులు
- బీజాపూర్ ఆధిల్షాయులు అనేక యుద్ధాల్లో ఓడిపోవడంతో, మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ సహాయం తీసుకున్నారు.
- పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో ఉన్న శివాజీ, శత్రు సేనచే చుట్టుముట్టబడ్డాడు.
- 10000 మంది సైన్యం, ఛత్రపతిని చంపేందుకు సిద్ధమైంది.
శివాజీకి స్పష్టంగా అర్థమైంది – ఈ యుద్ధంలో గెలవడం అసాధ్యం, తప్పించుకోవడమే మార్గం.
బాజీ ప్రభువు ధైర్యసాహసం
- కోటలోని ధాన్యం ఖాళీ అయిపోయే వరకు శివాజీ నిరీక్షించాడు.
- శత్రువుల సైన్యం కొంత భాగం ఆహారం కోసం బయలుదేరగానే, శివాజీ తన పరారికి సిద్ధమయ్యాడు.
- 13 జులై 1660, అమావాస్య సమీపిస్తోన్న చీకటి రాత్రి – శివాజీ తన అనుచరులతో విశాలఘడ్ కోటకు బయలుదేరాడు.
- శత్రువులను తప్పుదోవ పట్టించేందుకు శివాజీ పోలికలతో ఉన్న "శివకాశి" అనే సైనికుడిని, రాజు వేషధారణలో పంపారు.
అయితే ఆదిల్షాయిల సేన మోసం గుర్తించి, అసలు శివాజీ బంధించడానికి 8000 మంది సైన్యాన్ని పంపింది.
గోడ్కింగ్ ఘాటు – బాజీ ప్రభువు త్యాగం
- శత్రువులను ఆపేందుకు గోడ్కింగ్ అనే ఇరుకైన మార్గంలో 300 మంది సైన్యంతో బాజీ ప్రభు నిలబడ్డాడు.
- ఇక్కడ యుద్ధం జరగాలి, అప్పుడే శివాజీ సురక్షితంగా విశాలఘడ్ చేరుకోగలడు.
- ఒక్కసారిగా ఎక్కువ మంది ఈ మార్గాన్ని దాటలేరు, కాబట్టి తక్కువలో తక్కువ 2-3 గంటల పాటు పోరాడతానని బాజీ ప్రభువు ప్రతిజ్ఞ చేశాడు.
మృత్యువుతో యుద్ధం – శివాజీ రక్షణ
- 4 గంటల పాటు 300 మంది సైన్యం, 8000 మందితో భీకరంగా పోరాడింది.
- 5000 మంది శత్రువులను సంహరించి, చివరికి బాజీ ప్రభు సహచరులు తరిగిపోవడం ప్రారంభమైంది.
- బాజీ ప్రభు పూర్తిగా గాయాలపాలై రక్తంతో తడిసి ముద్దయినా, యుద్ధం ఆపలేదు.
- విశాలఘడ్ చేరుకున్న సంకేతంగా 5 సార్లు ఫిరంగి శబ్దం వినిపించగానే – బాజీ ప్రభువు తన ప్రాణాలను విడిచాడు.
బాజీ ప్రభువుకు శివాజీ నివాళి
- శివాజీ "గోడ్కింగ్" ప్రదేశాన్ని "పావన్ ఖింద్" (పవిత్ర ప్రదేశం)గా ప్రకటించాడు.
- బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు.
వీరుల త్యాగం – హిందుత్వ రక్షణ
ఈ దేశంలో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే, కారణం ఇలాంటి మహావీరుల త్యాగం!
🔥 జై భవానీ…!
🔥 జై శివాజీ…!
🔥 జై హింద్…!




