దేశం మొత్తం మీద వినాయకచవితి ఖర్చు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు!

హిందూ వ్యతిరేక నాస్తిక సంఘాలు దీనిని పెద్దగా చూపించి గగ్గోలు పెడుతున్నాయి. కానీ అదే హిందూ మతం గొప్పతనం!
హిందూ వ్యతిరేక నాస్తిక సంఘాలు దీనిని పెద్దగా చూపించి గగ్గోలు పెడుతున్నాయి. కానీ అదే హిందూ మతం గొప్పతనం! ఇప్పటికైనా తెలిసిందా, హిందూ పండుగల అసలైన విలువ?
ఈ మా పండగ వల్ల లక్ష అరవై వేల కోట్ల రూపాయల డబ్బు అనేక వృత్తుల వారికి చేరింది.
- విగ్రహాలు తయారు చేసే కళాకారులు నుంచి వారి సహాయకులు, మట్టి ఇచ్చేవారు, రంగులు అమ్మేవారు, రంగులు వేసేవారు—అందరికీ ఉపాధి లభించింది.
- తాటాకు/వెదురు కర్రలతో పందిళ్లు వేసే కార్మికులు, షామియానా, ఫాబ్రికేషన్ పందిళ్లు వేసే వాళ్లు పనితో నిండిపోయారు.
- బ్యాండ్ మేళం, సన్నాయి, డెకరేషన్, క్లాత్ వర్క్ చేసే టైలర్లు—ఇవాళ్లందరూ బిజీ అయ్యారు.
- పూల రైతులు, కోసేవారు, అల్లేవారు, అమ్మేవారు, దండలు కట్టేవారు—వీళ్లందరికీ అధిక ధరలు వచ్చాయి.
- విగ్రహాలు తీసుకెళ్లే ట్రాలీలు, లారీలు నడిపే డ్రైవర్లు—వీళ్లకు కూడా మంచి ఆదాయం వచ్చింది.
- అన్నదానాలు, వంటమనుషులు, సహాయకులు, టెంట్ హౌస్ సామగ్రి—అందరికీ డబ్బు తిరిగింది.
- లైటింగ్, సౌండ్, డెకరేషన్ వాళ్లు—వీళ్ల సామాగ్రి మంచి ధరలకు అద్దెకు వెళ్ళింది.
- పురోహితులు, బ్రాహ్మణులు—మంచి సంభావన దక్కింది.
- కొబ్బరికాయలు, అరటిపండ్లు, పత్రి, మామిడాకులు అమ్మే రైతులు—వీళ్ల ఇండ్లకు కూడా డబ్బు చేరింది.
- హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, భరతనాట్యం, సంగీత కచేరీలు, ఊరేగింపులలో నృత్యాలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు—ప్రతీ కళాకారుడు సంతోషంగా భోజనం పెట్టుకున్నాడు.
- చివరికి రోజువారీ కూలీలు కూడా పందిర్లకు స్తంభాలు తవ్వడం, షెడ్లకు రాడ్లు ఎత్తడం, రేకులు వేసే పనులు చేసి ఆదాయం పొందారు.
వినాయక మంటపాల ద్వారా కొత్త తరానికి సనాతన సంప్రదాయం పరిచయం అవుతుంది.
ఆర్థిక మాంద్యం బారిన పడిన అనేక దేశాలు ఉన్నా, మనం ధీమాగా ఉండటానికి ఇదే కారణం. ప్రతి పండగ మన సమాజంలోని వృత్తులన్నిటికీ ఉపాధి ఇస్తుంది.
👉 కులం అంటే వృత్తి. ప్రతి కులం గొప్పదే. ఒక కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించదు.
హిందూ పండగలలో ధనం ధర్మ భద్దంగా చందాల రూపంలో సేకరించి, అందరికీ పంచబడుతుంది.
మా భక్తి చాటున వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు నిలబడి ఉన్నాయి.
చివరగా ఒక మాట
వినాయకచవితి కేవలం పూజ మాత్రమే కాదు;
ఇది వృత్తిదారులకు ఉపాధి, రైతులకు ఆదాయం, కళాకారులకు గౌరవం, సమాజానికి ఐక్యత, మనందరికీ ఆనందం.
అందుకే హిందూ పండుగలలో ధనం కూడా ధర్మమే.
తరచుగా అడిగే ప్రశ్నలు
దేశం మొత్తం మీద వినాయకచవితి ఖర్చు ఎంత?
దేశం మొత్తం మీద వినాయకచవితి పండగ వల్ల లక్ష అరవై వేల కోట్ల రూపాయల డబ్బు అనేక వృత్తుల వారికి చేరింది.
వినాయకచవితి వల్ల ఎవరెవరికి ఉపాధి లభిస్తుంది?
విగ్రహాలు తయారు చేసే కళాకారులు, మట్టి, రంగులు అమ్మేవారు, పందిళ్లు వేసే కార్మికులు, బ్యాండ్ మేళం, టైలర్లు, డ్రైవర్లు, వంటమనుషులు, లైటింగ్, సౌండ్ వాళ్లు—అందరికీ ఉపాధి లభించింది.
వినాయకచవితి రైతులకు ఎలా ఆదాయం ఇస్తుంది?
పూల రైతులకు అధిక ధరలు వచ్చాయి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పత్రి, మామిడాకులు అమ్మే రైతుల ఇండ్లకు కూడా డబ్బు చేరింది.
వినాయకచవితి సమయంలో కళాకారులకు ఎలాంటి పని దొరుకుతుంది?
హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, భరతనాట్యం, సంగీత కచేరీలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు చేసే కళాకారులకు పని, ఆదాయం దొరుకుతుంది.
వినాయక మంటపాల సామాజిక ప్రాముఖ్యత ఏమిటి?
వినాయక మంటపాల ద్వారా కొత్త తరానికి సనాతన సంప్రదాయం పరిచయం అవుతుంది. పండగ ధనం చందాల రూపంలో సేకరించి అందరికీ పంచబడుతుంది.
వినాయకచవితి కేవలం పూజ మాత్రమేనా?
కాదు. వినాయకచవితి వృత్తిదారులకు ఉపాధి, రైతులకు ఆదాయం, కళాకారులకు గౌరవం, సమాజానికి ఐక్యత, అందరికీ ఆనందం ఇచ్చే పండగ.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
పండుగలు నుంచి మరిన్ని
- అయ్యప్ప స్వామి మాలధారణ 2026: తేదీ, సామగ్రి, దశలవారీ విధానం మరియు 41 రోజుల వ్రత నియమాలు
- మీరాబాయి జయంతి 2026: కృష్ణ భక్తికి నిలువెత్తు ప్రతీక – జీవితం, ప్రాముఖ్యత & భజనలు
- 12 జ్యోతిర్లింగ యాత్ర 2026: తీర్థయాత్ర గైడ్, ప్రయాణ ప్రణాళిక & ఖర్చులు | HinduTone
- వృశ్చిక సంక్రాంతి 2026: సోమవారం, 16 నవంబర్, సంక్రమణ సమయం 7:48 PM IST, నగరాల వారీగా పుణ్యకాలం, కార్తిగై మరియు శబరిమల మండల కాలం
- తెలంగాణలో వైకుంఠ ఏకాదశి: యాదాద్రి & చిలుకూరు బాలాజీ




